ఫైటర్ తో బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్..!

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నాడట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వినిపిస్తుంది. విజయ్ తో సినిమా తీయాలని బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాతో అది చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఫైటర్ సినిమాను సౌత్ లోని అన్ని భాషల్లో తీయడానికి చూస్తున్న సంగతి విదితమే. అయితే వాటితో పాటే హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారట. ఈ ఫైటర్ నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ఈ రోజు ముంబైలో కరణ్ జోహర్‌ తో ఈ విషయంపై చర్చించారట. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. మరి చూద్దాం అధికారిక ప్రకటన వచ్చేంతవరకు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + nine =