నెగెటివ్ రోల్స్ లో నటించాలని ఉంది..!

Kartikeya Wants To Play Negative Roles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Kartikeya Latest News,Kartikeya New Movie Updates,Kartikeya Next Film Updates,Kartikeya Latest Movie Details,Kartikeya Next Project Updates

‘RX 100’తో ఆరంగేట్రం చేసి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఈ సినిమా తరవాత ‘గుణ369’, ‘హిప్పీ’ లాంటి భారీ సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. రీసెంట్ గా వచ్చిన  90 ఎంఎల్ కు కాస్త పాజిటివ్ టాకే వచ్చింది. ప్రస్తుతం 2 సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీ గా వున్నాడు కార్తికేయ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తనకు నెగెటివ్ రోల్స్ చేయాలని చాలా ఆసక్తికరంగా  ఉందంటున్నాడు కార్తికేయ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనకు మరిన్ని విలన్‌ పాత్రలు చేయాలని ఉందని… కానీ అవి నన్ను ఎగ్జైట్‌ చేసేలా ఉండాలి.. మంచి కథ ఉంటే విలన్ పాత్రలు చేయడానికైనా రెడీ అని.. నెగెటివ్ రోల్స్ చేయడానికి నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని తెలిపాడు. అంతే కాదు హీరో పాత్ర అయినా.. విలన్ పాత్ర అయినా ప్రేక్షుకులు ఆదరిస్తారన్న ధైర్యం వచ్చిందని అన్నాడు.

కాగా గతంలోనే కార్తికేయ నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కార్తికేయ చేసిన విలన్‌ పాత్రకు మంచి స్పందన వచ్చిన సంగతి కూడా విదితమే.

మరి కార్తికేయ మాటలు విన్న డైరెక్టర్స్ తన కోసం నెగెటివ్ క్యారెక్టర్స్ రాస్తారేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =