కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 16

సినిమా వార్తలు

ఫిల్మ్ సిటీలో అజిత్ కొత్త చిత్రం

హిందీ బ్లాక్ బ‌స్ట‌ర్ `పింక్`కి త‌మిళ రీమేక్ గా రూపొందిన `నేర్ కొండ పార్ వై`తో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హెచ్. వినోద్. క‌ట్ చేస్తే... ఇప్పుడీ ఇద్ద‌రి కాంబినేష‌న్ లోనే `వ‌లిమై` పేరుతో మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సంక్రాంతి త‌రువాత `పింక్` తెలుగు రీమేక్ షూటింగ్?

హిందీలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఎమోష‌నల్ కోర్ట్ డ్రామా `పింక్`... తెలుగులో రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `ఎంసీఏ` ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ రూపొందించ‌నుండ‌గా.... `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

బ‌న్నీ చిత్రంలో మూడే మూడు పాట‌లా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్... ఈ ముగ్గురి క‌ల‌యికలో సినిమా అంటే అదో మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ అనే ఫిక్స్ అవ్వాలి. `ఆర్య‌`, `ఆర్య 2`తో ఇప్ప‌టికే రెండు సార్లు ఇలా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ త్ర‌యం... ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుకట్టింది. అంతేకాదు... గ‌త చిత్రాల‌కు భిన్నంగా సాగే క‌థ‌తో ఈ టాలెంటెడ్ సెన్సేష‌న్స్ మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేచుర‌ల్ స్టార్ తో `టాక్సీవాలా` డైరెక్ట‌ర్?

నేచుర‌ల్ స్టార్ నాని ప్రస్తుతం త‌న 25వ చిత్రం `వి`తో బిజీగా ఉన్నాడు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ లోపే `నిన్ను కోరి` ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబినేష‌న్ లో `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రాన్ని పట్టాలెక్కించ‌నున్నాడు నాని.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

అర్జున్ సురవరం పది రోజుల కలెక్షన్స్

విడుదలకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఫైనల్ విడుదలై మొత్తానికి డీసెంట్ హిట్ టాకే తెచ్చుకుంది నిఖిల్ 'అర్జున్ సురవరం'. నవంబర్ 29 వ తేదీన రిలీజ్ ఐన ఈ సినిమా మొదటిరోజే మంచి టాకే తెచ్చుకొని... కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. మొదటిరోజే 4.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని... నిఖిల్ గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిరోజే మంచి షేర్స్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా పది రోజుల్లో మంచి కలెక్షన్స్ ఆ రాబట్టినట్టు తెలుస్తుంది. పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7.12 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 7.99 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్..!

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జ‌రుపుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పుడే ఒక పాటకు మణిశర్మ ట్యూన్ కూడా కట్టినట్టు తెలుస్తుంది

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'అశ్వ‌థ్థామ‌' ప్రెస్ మీట్ - ఏం చెపుతాడో..!

'నర్తనశాల' సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో 'అశ్వ‌థ్థామ‌' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'దబాంగ్ 3' రిలీజ్ డేట్ ఫిక్స్

సల్మాన్, సోనాక్షి సిన్హా జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దబాంగ్ మూవీ సిరీస్ లో భాగంగా దబాంగ్ 3 తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. దేనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Venkatesh Talks About Multi-Starrer Movies
సినిమా వార్తలు

ప్రభాస్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ కు రెడీ..!

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ `వెంకీమామ‌`కి `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంకా విడుదలకు రెండు రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు.

TFN Adminవాట్సాప్
Worthy Successors To Worthy Fathers
సినిమా వార్తలు

తండ్రికి తగ్గ వారసులు

'సూపర్ స్టార్'.. ఈ బిరుదు మహేష్ బాబుకు చాలా చక్కగా సరిపోతుంది. కేవలం ఒక్క సినిమాల్లోనే కాదు అన్నిరంగాల్లోనూ తనదైన మార్క్ చూపిస్తూ 'సూపర్ స్టార్' అనే బిరుదును సార్ధకం చేస్తున్నాడు. అటు సినిమాలు, సేవా కార్యక్రమాలు, పలు ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా, మల్టీప్లెక్స్ రంగంలోకి, నిర్మాణ రంగంలోకి, ఇంకా టెక్స్టైల్ రంగంలో కూడా అడుగుపెట్టి 'హంబుల్' అనే బ్రాండ్ ను కూడా తీసుకొచ్చాడు ఇలా అన్ని రంగాల్లోనూ తన మార్క్ ను చూపిస్తూ కంప్లీట్ బిజినెస్ మ్యాన్ కూడా అనిపించుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Donga Latest Trailer, Donga Movie Trailer Out, Donga Movie Updates, Donga New Trailer, Donga Official Trailer, Donga Telugu Movie Latest News, Donga Telugu Movie Trailer, Donga Trailer, Karthi Starrer Donga Movie Trailer Out, Karthi Starrer Donga Tra
ట్రైలర్ & టీజర్

'దొంగ' ట్రైలర్ రిలీజ్

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో మంచి హిట్ కోసం ఎదురుచూసిన కార్తీ ఎదురుచూపులు ఫలితం దక్కింది.ఇక 'ఖైదీ' అయిపోయింది.. ఇప్పుడు ‘దొంగ’ గా వచ్చేస్తున్నాడు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఇది. తమిళంలో ‘తంబి’ గా వస్తుండగా... తెలుగులో 'దొంగ' టైటిల్ తో వస్తుంది.ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్న ఈ సినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
మన్యంలో RRR షూటింగ్
షూటింగ్ అప్‌డేట్

మన్యంలో RRR షూటింగ్

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
వర్మ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రైలర్ & టీజర్

వర్మ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ గోపాల్ వర్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు. ఇప్పటికే 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో వున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద దుమారం రేగగా ఈ సినిమా టైటిల్ ను కూడా మార్చుకోవాల్సి వచ్చింది.

TFN Adminవాట్సాప్
Thaman Tweets About Prati Roju Pandaage Movie
సినిమా వార్తలు

"ప్రతి రోజూ పండగే " మూవీ పై థమన్ ట్వీట్

హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా "ప్రతి రోజూ పండగే " మూవీ డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్, రావు రమేష్ , రజిత ముఖ్య పాత్రలలో నటించారు. గీతా ఆర్ట్స్ 2 , యు వి క్రియేషన్స్ పై రూపొందిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. "ప్రతి రోజూ పండగే " మూవీ ప్రమోషన్స్ చిత్ర యూనిట్ భారీగా చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

చిరు - కొర‌టాల మూవీకి రాజ‌మండ్రి ట‌చ్?

`ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా... న‌ర‌సింహారెడ్డి`తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన‌ మెగాస్టార్ చిరంజీవి... త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి `ఆచార్య‌` అనే టైటిల్ ప‌రిశీల‌నలో ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్ర‌భాస్ కోసం శంక‌ర్ స్క్రిప్ట్?

`బాహుబ‌లి` సిరీస్ తో జాతీయ‌స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ఇక `సాహో`తో అయితే బాలీవుడ్ లో మ‌రోసారి స‌త్తా చాటాడు. పాన్ ఇండియా స్టార్ గా ముందుకు సాగుతున్న ప్ర‌భాస్ కోసం ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కులు వేచిచూస్తున్నారు. వారిలో `రోబో` శంక‌ర్ ఒక‌రు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`పింక్` రీమేక్ లో సామ్?

ఎమోష‌న‌ల్ కోర్ట్ డ్రామాగా తెర‌కెక్కిన హిందీ చిత్రం `పింక్`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మాతృక‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించిన పాత్ర‌ని తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయ‌బోతున్నాడు. `ఎంసీఏ` ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ రూపొందించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`వెంకీమామ‌` ర‌న్ టైమ్ డిటైల్స్

రియ‌ల్ లైఫ్ మేన‌మామ‌, మేన‌ల్లుడు విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య రీల్ లైఫ్‌లోనూ అవే పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `వెంకీమామ‌`. బాబీ (కె.యస్. ర‌వీంద్ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. కాగా, ఈ నెల 13న వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`యూ ట‌ర్న్` రీమేక్ లో తాప్సీ?

ద‌క్షిణాదిన సెన్సేష‌న్ క్రియేట్ చేసిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ `యూ ట‌ర్న్`... ఇప్పుడు హిందీ బాట ప‌డుతోంది. క‌న్న‌డ‌, తెలుగు -త‌మిళ వెర్ష‌న్స్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌వ‌న్ కుమార్... బాలీవుడ్ వెర్ష‌న్ కి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. కాగా... క‌న్న‌డంలో శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్, తెలుగు - త‌మిళ భాష‌ల్లో స‌మంత పోషించిన ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ ర‌చ‌న పాత్ర‌ని హిందీలో తాప్సీ చేయ‌నుంద‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రభాస్ ?

"బాహుబలి ", "బాహుబలి 2" బ్లాక్ బస్టర్ మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ డమ్ పొందారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభాస్ కు పర్టిక్యులర్ గా నార్త్ ఇండియా లో ఎక్కువ క్రేజ్ఉంది . హీరో ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ , స్టైలిష్ మూవీ "సాహో " ఉత్తరాది లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్ నిర్మాత , దర్శకులు ప్రభాస్ తో మూవీస్ నిర్మించాలని ఎదురుచూస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్