టాలెంటెడ్ హీరో రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో `విరాట పర్వం`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత `హిరణ్య కశ్యప` చేయబోతున్న సంగతి విదితమే. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో టైటిల్ రోల్ ప్లే చేయబోతున్నాడు రానా. ఫిబ్రవరి రెండో వారంలో చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రానా తన నిర్మాణంలో పలు సినిమాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా తన నిర్మాణంలో వస్తున్న కొత్త సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. క్షణం డైరెక్టర్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ టైటిల్ ను ఫిక్స్ చేశారు ఈ సినిమాకు.
Love, and other drugs ! Coming soon ! @ravikanthperepu@RanaDaggubati#shalinivadnikatti @shraddhasrinath@IamSeeratKapoor @samyuktahornad @SaiprakashU https://t.co/IbEX2TC6Zu
— Siddu_boy (@Siddhu95229008) December 9, 2019
కాగా ఈసినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించనున్నారు. రానా సమర్పణలో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాను త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: