‘మత్తు వదలరా’ రిలీజ్ డేట్ ఫిక్స్

Mathu Vadalara Movie Release Date Confirmed

రాజ‌మౌళి కుటుంబం నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు న‌టులు రాలేదు. ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి దర్శకులు వచ్చారు.. రచయితలు, గాయకులు ఇలా అంతా టెక్నీషియన్లే వ‌చ్చారు. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీర‌బోతుంది. హీరో లేడ‌నే లోటును భ‌ర్తీ చేయ‌డానికి ఆ కుటుంబం నుంచి కూడా ఓ వార‌సుడు వ‌చ్చేస్తున్నాడు. కీరవాణి చిన్న కొడుకు సింహా హీరోగా నటిస్తున్న మత్తు వదలరా సినిమా షూటింగ్ వేగంగా పూర్తవుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ రావడమే కాదు సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఇంకా ఈ సినిమాలో నరేష్‌ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. కీరవాణి తనయుడు బాహుబలి2, అరవింద సమేత మూవీస్ హిట్ సాంగ్స్ పాడిన కాలభైరవ మత్తువదలరా మూవీతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ .. క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరి ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు వచ్చారు… వస్తూనే వున్నారు. ఇప్పుడు కీరవాణి తనయుడు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. మరి కీరవాణి కొడుకులు హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంత వరకూ సక్సెస్ అవుతారో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.