సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ లో ఇప్పటినుండే జోరు పెంచారు. ఇప్పటికే టీజర్ ను, ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రతి సోమవారం ఒక పాటను రిలీజ్ చేస్తామని చెప్పినట్టే.. ఈరోజు రెండో పాటను రిలీజ్ చేశారు. సూర్యుడో.. చంద్రుడో అంటూ వచ్చే ఈ పాట ఆకట్టుకుంటుంది.
కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: