అసురన్ రీమేక్ లో అభిరామ్ ఎంట్రీపై సురేష్ బాబు క్లారిటీ..!

Suresh Babu Gives Clarity About Abhiram Entry

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలుతీసుకున్నారు. ఎంతో మంది పేర్లను పరిగణలోకి తీసుకొని ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాలకి ఫిక్స్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గతకొద్ది కాలంగా ఈ సినిమాతోనే సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ను ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని సురేష్ బాబు అనుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో వెంకటేశ్ కొడుకుగా అభిరామ్ పరిచయం కానున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు సురేష్ బాబు. ఈ విషయంపై సురేశ్ బాబు మాట్లాడుతూ…. ఈ సినిమా ద్వారా అభిరామ్ ను పరిచయం చేసే ఉద్దేశం లేదనీ, సోలో హీరోగానే అభిరామ్ ను పరిచయం చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం అభిరామ్ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని అన్నారు.

కాగా అసురన్ తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − five =