వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్

Music Director Thaman S In Superb Form,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Music Director Thaman Latest News,Music Director Thaman Upcoming Movie News,Music Director Thaman Next Film News,Music Director Thaman Live News

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఈ పేర్లే వినిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే.. దేవిని కూడా వెనక్కి నెట్టేసి తమన్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. కిక్ సినిమాతో తన ప్రయాణాన్నిమొదలు పెట్టిన తమన్ వరుస సినిమాలతో బిజీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం పలు సినిమాలు తమన్ చేతిలో వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటగా సందడి వెంకీ మామ సినిమాతో మొదలవుతుంది. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కిన వెంకీ మామ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది. ఇక వారం రోజుల తర్వాత అంటే డిసెంబర్ 20న సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి రోజూ పండగే చిత్రానికి కూడా తమన్ సంగీతం అందించాడు. సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కు తమనే. అంతేనా త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా నుండి విడుదలైన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. జనవరి 24న విడుదలవ్వనున్న డిస్కో రాజా చిత్రానికి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అంతేకాదు రవితేజ తర్వాతి సినిమా క్రాక్ కు కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమనే.

అంతేకాదు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాకి కూడా తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాకి కూడా తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఇంకా పలువురు డైరెక్టర్ లు కూడా తమ సినిమాలకు తమన్ నే తీసుకోవాలని చూస్తున్నారట.

అయితే తమన్ ఏదో ఫామ్ లో ఉన్నాడు కదా అని అందరూ సెలెక్ట్ చేసుకోవడంలేదు. దీనికి వేరే కారణం కూడా వుంది. చాలా తక్కువ టైమ్ లో బెటర్ ఔట్పుట్ ఇవ్వడం…రెమ్యూనేషన్ విషయంలో కూడా రీజనబుల్ గా ఉండడం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టడం, ఇవన్నీ అందరూ తమన్ వైపు చూసేలా చేస్తున్నాయి. మరి ముందు ముందు కూడా తమన్ ఇలానే చేతినిండా సినిమాలతో బిజీగా ఉండాలని కోరుకుందాం..

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 6 =