కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Pothineni

ట్యాగ్ · 207 కథనాలు · పేజీ 10

సినిమా వార్తలు

రామ్ పోతినేని న్యూ లుక్

సూపర్ హిట్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ పోతినేని, ఆ మూవీ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్ష కులను ఆకట్టుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన చాక్లెట్ బాయ్ లా ఉండే హీరో రామ్ , బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో ఒక మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా జీ సినీ అవార్డ్ అందుకున్నారు. "ఇస్మార్ట్ శంకర్ " మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో రామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"RED" మూవీ సెన్సార్ పూర్తి

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "RED "మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో నివేత పేతురాజ్, మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. "RED" మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'రెడ్' ట్రైలర్ రిలీజ్

నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా ఆయనకు మూడవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేను శైలజతో పాటు ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'రెడ్' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Tollywood Hero Ram Pothineni Shares His New Look Pictures On Social Media
సినిమా వార్తలు

ఫ్రెష్ లుక్ లో హీరో రామ్

"దేవదాసు ", "రెడీ ", "కందిరీగ ", "పండగ చేస్కో ", "నేను శైలజ ", "హలో గురు ప్రేమకోసమే " వంటి సూపర్ హిట్ మూవీస్ లో రామ్ పోతినేని తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ లా ఉండే హీరో రామ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మాస్ క్యారెక్టర్ లో పక్కా హైదరాబాదీ యువకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో రామ్ కు మరోసారి జోడీగా అనుపమ పరమేశ్వరన్ ?

సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ప్రేమమ్ "," శతమానం భవతి ", "హలో గురు ప్రేమకోసమే ", రాక్షసుడు" వంటి సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. స్లిమ్ గా మరింత అందంగా మారిన అనుపమ ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న "18పేజెస్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి కథానాయిక గా ఎంపిక అయ్యారని సమాచారం.

Team TFNవాట్సాప్
Actor Ram Pothineni Latest Pictures Shared On Social Media Attracts Netizens Attention
సినిమా వార్తలు

హీరో రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లుక్

"ఇస్మార్ట్ శంకర్ "విజయోత్సాహం లో ఉన్న హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో నిజ సంఘటనలతో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ సంక్రాంతి కి రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. మణి శర్మ సంగీతం అందించారు. కొవిడ్ - 19 కారణంగా "RED " మూవీ రిలీజ్ వాయిదాపడింది.

Team TFNవాట్సాప్
Poll Game: Which Among These Is Your Favorite Movie Of Ram?
సినిమా వార్తలు

పోల్ గేమ్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ బెస్ట్ మూవీ ?

వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ , ఇలియానా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "దేవదాసు "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో హీరో రామ్ , హీరోయిన్ ఇలియానా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చక్రి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

Team TFNవాట్సాప్
Bollywood Hero To Remake iSmart Shankar Movie?
సినిమా వార్తలు

బాలీవుడ్ రీమేక్ "ఇస్మార్ట్ శంకర్" లో రణవీర్ సింగ్ ?

పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందించారు. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. పక్కా తెలంగాణ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామ్-సంతోష్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి..?

పలు సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేసి 'కందిరీగ' సినిమాతో డైరెక్టర్ గా మారాడు సంతోష్ శ్రీనివాస్. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తీసిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీనే ఈ సినిమాకు ప్రధాన బలం. దానికి తగ్గట్టే ఈ సినిమాలో రామ్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో హైపర్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఇక ఇప్పుడు ముచ్చట మూడోసారి కాంబినేషన్ రిపీట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హ్యాపీ బర్త్‌ డే జెన్నూ

హీరో రామ్, జెనీలియా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. 2008లో వచ్చిన ‘రెడీ’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటినుండి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ రోజు జెనీలియా పుట్టిన రోజు కావడంతో తన ట్విట్టర్‌ వేదికగా ఆమెకు బర్త్‌డే విషేస్‌ తెలిపాడు రామ్. ‘ఎవరైనా ఏది కావాలన్నా అడగగలిగే సెల్ఫ్ లెస్ మరియు కేరింగ్ ఫ్రెండ్ నువ్వు.. హ్యాపీ బర్త్‌ డే జెన్నూ. రానున్న సంవత్సరాలు మరింత ఉత్తమంగా ఉండాలని ఆశిస్తున్నాను. త్వరలోనే ఇదే రోజున మనందరం మరోసారి కలుసుకుందాం’ అంటూ ట్వీట్‌ చేశారు రామ్‌. అంతేకాక జెనీలియా కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. దీనిలో జెనీలియా, ఆమె భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హ్యాపీ బర్త్ డే - నా ఓటు నీకే బ్రదర్

రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి బాసటగా నిలిచాడు. దీనితో సోనూసూద్ రియ‌ల్ హీరో అంటూ ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈరోజు సోనూసూద్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
Ismart Actor Ram Pothineni Tweet Now Attracts Netizens Attention
సినిమా వార్తలు

సినిమా కొందరికి ప్యాషన్.. చాలా మందికి వ్యాపారం..!

కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజానికి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక మొన్ననే ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా అని ట్వీట్ చేసి ఫ్యాన్స్ కి ప్రామిస్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేసాడు రామ్. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. సినిమా అనేది కొందరికి ప్యాషన్, చాలా మందికి వ్యాపారం…ఇక మిగిలిన వారికి జూదం అని చెప్పుకొచ్చారు. అయితే రామ్ ఈ ట్వీట్ ఎందుకు పెట్టాడా అన్న చర్చలు జరుగుతున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా..!

గతేడాది వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తో మళ్ళీ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు రామ్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు రామ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వెంటనే మరో క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాను లైన్ లో పెట్టేశాడు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజానికి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు ఇదే నా విజ్ఞప్తి..!

కరోనాతో దేశం పెద్ద యుద్ధమే చేస్తుంది. అందరూ ఇళ్లల్లోనే ఉంటూ పోరాడుతున్నారు. ఇక ఈ కరోనా వల్ల పెళ్లిళ్లు పలు వేడుకలకు కూడా దూరమయ్యారు ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు, సన్నిహితులు, స్నేహితులను ఇబ్బంది పెట్టకూడదని ఎనర్జిట్ స్టార్ రామ్ పోతినేని నిర్ణయం తీసుకొన్నారు. మే 15న రామ్ పుట్టినరోజు. అయితే ఈ సందర్భంగా రామ్ పోతినేని తన అభిమానులు ఎవరు తన బర్త్ డే వేడుకలు చేయోద్దంటూ రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. ఈ సమయంలో అందరు ఇంట్లోనే ఉంటూ కరోనానను తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో రామ్ కోలీవుడ్ ఎంట్రీ

సూపర్ హిట్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి రామ్ పోతినేని తన యాక్టింగ్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "రెడీ","కందిరీగ", పండగ చేస్కో, "నేను శైలజ" వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ రఫ్ లుక్ తో నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "RED" మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్క్రిప్ట్స్ వినడంలో రామ్ బిజీ

బ్లాక్ బస్టర్ "దేవదాసు " మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన రామ్ పోతినేని, తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "రెడీ"," కందిరీగ", "పండగ చేస్కో", "నేను శైలజ" వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. స్టైలిష్, సింపుల్, స్మార్ట్ , పక్కింటి అబ్బాయి వంటి పాత్రలలో కనిపించిన రామ్ ఒక్కసారిగా రఫ్ లుక్ లో మారి "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో నటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'రామ్' డైలమాలో లేడంటున్న 'రామ్'

కరోనా వల్ల సినిమా సినిమా రిలీజ్ మొత్తం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు మొత్తం వాయిదా వేసుకున్నాయి. తాజాగా లాక్ డౌన్ డేట్ కూడా పొడిగించారు . ఇక ఈ నెల కూడా కొత్త సినిమాలను చూసే అవకాశం లేనట్టే. ఇక ఈ నేపథ్యంలో తన సినిమాను థియేటర్ లోనే చూడమంటున్నాడు యంగ్ హీరో రామ్. రామ్ అలా చెప్పడానికి అసలు కారణం ఏంటంటే...

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రామ్‌తో మారుతి ఫ్యామిలీ డ్రామా?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం `నేను శైల‌జ‌` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్న ‘రెడ్‌’తో బిజీగా ఉన్నాడు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘త‌డ‌మ్‌’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో రామ్ తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. స్ర‌వంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఏప్రిల్ 9న విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా కరోనా వైర‌స్ కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే... రామ్ తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Baahubali Director SS Rajamouli To Make A Movie With iSmart Hero Ram Pothineni
సినిమా వార్తలు

రామ్ తో రాజ‌మౌళి చిత్రం?

తెలుగునాట అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న 11 చిత్రాలను డైరెక్ట్ చేయ‌గా... ప్ర‌తీ సినిమా విజ‌య‌ఢంకా మ్రోగించింది. ప్ర‌స్తుతం ఈ స్టార్ డైరెక్ట‌ర్.. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో పేట్రియాటిక్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`ని తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2021 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్

షేర్