‘రామ్’ డైలమాలో లేడంటున్న ‘రామ్’

I am Not In Any Dilemma Says Hero Ram Pothineni
I am Not In Any Dilemma Says Hero Ram Pothineni

కరోనా వల్ల సినిమా సినిమా రిలీజ్ మొత్తం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు మొత్తం వాయిదా వేసుకున్నాయి. తాజాగా లాక్ డౌన్ డేట్ కూడా పొడిగించారు . ఇక ఈ నెల కూడా కొత్త సినిమాలను చూసే అవకాశం లేనట్టే. ఇక ఈ నేపథ్యంలో తన సినిమాను థియేటర్ లోనే చూడమంటున్నాడు యంగ్ హీరో రామ్. రామ్ అలా చెప్పడానికి అసలు కారణం ఏంటంటే…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ కారణంగా ఈ మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్‌లో విడుద‌ల చేస్తారని ఇటీవల ప్ర‌చారం జ‌రిగింది. రామ్ డైలమాలో ఉన్నడా అంటూ ఒక కథనం రాగా… ఈ నేప‌థ్యంలో ఓ నెటిజ‌న్‌.. రామ్ డైల‌మాలో ఉన్నాడా? ఎంత లేట్ అయిన ప‌ర్లేదు అన్నా. సినిమాని థియేట‌ర్‌లో రిలీజ్ చేయండి. థియేట‌ర్స్‌లో వ‌చ్చే వర‌కు మేం అదే ప్రేమ‌తో ,ఓపిక‌తో ఉంటాం అని త‌న కామెంట్‌లో తెలిపాడు. ఇక నెటిజ‌న్ కామెంట్‌కి స్పందించిన రామ్.. రామ్ డైల‌మాలో ఏ మాత్రం లేడు. వాస్తవానికి అతను ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టుగా సోషల్ డిస్టెన్సింగ్ , స్వీయ నిర్భంధంలో ఉన్నాడు. (15 సంవత్సరాలుగా చేస్తున్నట్లుగా..) అత‌ను కూడా త‌న ఫ్యాన్స్ అంద‌రు రెడ్ సినిమాని బిగ్ స్క్రీన్‌పైనే చూడాల‌ని కోరుకుంటున్నాడు అని త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు.


కాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ సినిమా తెరకెక్కింది. నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్య‌ర్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను… స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + seven =