‘రెడ్’ ట్రైలర్ రిలీజ్

Double Dose Of Entertainment From Ram Pothineni, Hero Ram Pothineni RED Movie, Ram Pothineni, Ram Pothineni Red Movie, Ram Pothineni Red Movie Trailer, Ram Pothineni Red Movie Updates, Red Movie Trailer, Red Movie Trailer Highlights, Red Movie Trailer News, RED Movie Trailer Release, RED Movie Updates, Red The Film, Telugu Filmnagar

నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా ఆయనకు మూడవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేను శైలజతో పాటు ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఉన్నది ఉన్నట్లు కాకుండా రామ్ ఇమేజ్ కు సరిపోయేలా కొన్ని మార్పులు చేశాడు కిషోర్. సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరి రెడ్ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తుంటే హత్యల చుట్టూ సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కినట్టు అర్ధమవుతుంది. ఇక రామ్ ది కూడా ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ ఒకటి మాస్ క్యారెక్టర్ అని అర్ధమవుతుంది. మాస్ పాత్రలో రామ్ ఎలా చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో కూడా మాస్ పాత్రలో రామ్ ఓ రేంజ్ లో నటించాడు.

కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్య‌ర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 4 =