శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “RED “మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో నివేత పేతురాజ్, మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. “RED” మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “తడమ్ “తమిళ మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన “RED” మూవీ సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ “RED” మూవీ కి U /A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ “RED” మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుందని అనౌన్స్ చేసింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తరువాత రామ్ హీరోగా రూపొందిన “RED” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: