హ్యాపీ బర్త్‌ డే జెన్నూ

Tollywood Young Actor Ram Pothineni Wishes Genelia On Her Birthday

హీరో రామ్, జెనీలియా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. 2008లో వచ్చిన ‘రెడీ’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటినుండి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ రోజు జెనీలియా పుట్టిన రోజు కావడంతో తన ట్విట్టర్‌ వేదికగా ఆమెకు బర్త్‌డే విషేస్‌ తెలిపాడు రామ్. ‘ఎవరైనా ఏది కావాలన్నా అడగగలిగే సెల్ఫ్ లెస్ మరియు కేరింగ్ ఫ్రెండ్ నువ్వు.. హ్యాపీ బర్త్‌ డే జెన్నూ. రానున్న సంవత్సరాలు మరింత ఉత్తమంగా ఉండాలని ఆశిస్తున్నాను. త్వరలోనే ఇదే రోజున మనందరం మరోసారి కలుసుకుందాం’ అంటూ ట్వీట్‌ చేశారు రామ్‌. అంతేకాక జెనీలియా కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. దీనిలో జెనీలియా, ఆమె భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌, వారి పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇక ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమా తరువాత రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కాగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను… స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకరు దొంగ మరొకరు కాంట్రాక్టర్ అని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.