హీరో రామ్ కు మరోసారి జోడీగా అనుపమ పరమేశ్వరన్ ?

Anupama Parameswaran To Pair Up With Ram Once Again After Hello Guru Prema Kosame

సూపర్ హిట్ “అ ఆ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ప్రేమమ్ “,” శతమానం భవతి “, “హలో గురు ప్రేమకోసమే “, రాక్షసుడు” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. స్లిమ్ గా మరింత అందంగా మారిన అనుపమ ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18పేజెస్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి కథానాయిక గా ఎంపిక అయ్యారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హారిక &హాసిని బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో దర్శకుడు త్రివిక్రమ్ అనుపమ ను కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. “హలో గురు ప్రేమకోసమే ” మూవీ లో రామ్ , అనుపమ జంటగా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డ్ అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ , అందాల అనుపమ మరోసారి జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here