రామ్-సంతోష్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి..?

Ram Pothineni To Work with this director for third time

పలు సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేసి ‘కందిరీగ’ సినిమాతో డైరెక్టర్ గా మారాడు సంతోష్ శ్రీనివాస్. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తీసిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీనే ఈ సినిమాకు ప్రధాన బలం. దానికి తగ్గట్టే ఈ సినిమాలో రామ్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో హైపర్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఇక ఇప్పుడు ముచ్చట మూడోసారి కాంబినేషన్ రిపీట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా సమాచారం ప్రకారం రామ్ తో సినిమా చేయడానికి సంతోష్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ కథను రెడీ చేసినట్టు… రామ్ కూడా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. స్రవంతీ రవికిశోర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించనున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘అల్లుడు శ్రీను’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్య‌ర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. నిజానికి ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు.. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరి థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 14 =