పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందించారు. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. పక్కా తెలంగాణ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఈ రీమేక్ మూవీ లో స్టార్ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఎంపిక అయ్యారని సమాచారం. సూపర్ హిట్ “బ్యాండ్ బాజా బారాత్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన రణవీర్ సింగ్ “గలి యోంకీ రాసలీల రామ్ లీల “, “బాజీరావు మస్తానీ “, “పద్మావత్ “, “సింబా “, “గల్లీ బాయ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. రణవీర్ ప్రస్తుతం 3 హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. “ఇస్మార్ట్ శంకర్ ” హిందీ రీమేక్ మూవీ ని ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ తెరకెక్కించనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: