ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా..!

Ram Pothineni Gets Emotional about his fans
Ram Pothineni Gets Emotional about his fans

గతేడాది వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తో మళ్ళీ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు రామ్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు రామ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వెంటనే మరో క్రైమ్ థ్రిల్లర్ ‘రెడ్’ సినిమాను లైన్ లో పెట్టేశాడు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజానికి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిన్న రామ్ పుట్టిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘డించక్’ మాస్ సాంగ్ టీజర్ విడుదల చేసారు. ఈ సాంగ్ థియేటర్స్ లో ఖచ్చితంగా బ్లాస్ట్ అవడం ఖాయమంటూ రామ్ ట్విట్టర్ వేదికగా సాంగ్ టీజర్ రిలీజ్ చేసాడు. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ సాంగ్ టీజర్ లో రామ్ మాస్ ఎనర్జీ స్టెప్స్ తో దుమ్ము రేపాడు. ఇక ఈ పాటకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉండగా తన ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి ఫిదా అయిన రామ్.. తన ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కు మరోసారి మాట ఇచ్చాడు. మై డియర్ ఫ్యాన్స్… నిన్న రాత్రి చాలా మంది నిద్రపోకుండా.. తినకుండా వున్నారని విన్నాను.. మీరు నా హృదయాన్ని కదలించేసారు.. ప్రేమను చూపించడానికి ఈ ప్రపంచంలో మీరు నాకున్నారు.. ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా అంటూ ట్వీట్ చేసాడు.

కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్య‌ర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ బిసినెస్ భారీ రేంజ్ లోనే నడుస్తుంది. మరి చూద్దాం ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 2 =