‘రెడ్’ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

Hero Ram Pothineni RED Movie, Ram Pothineni, Ram Pothineni Red Movie, Ram Pothineni Red Movie Updates, Ram Red Movie Release Date Locked, RED Movie Confirms Trailer Release, RED movie confirms trailer release date, RED Movie Trailer, RED Movie Trailer Release, RED Movie Trailer Release Date, Red Movie Updates, Telugu Filmnagar

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 24న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇక థియేటర్స్ ఎలాగూ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్య‌ర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి రావడంతో ఇప్పుడు ‘రెడ్’ సినిమా కు మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ సినిమా రామ్ కు ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.