
ట్యాగ్ · 26 కథనాలు


పవన్ కళ్యాణ్‌కు రేణు దేశాయ్ స్పెషల్ విషెస్

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్

మహేష్ కు పవన్ స్పెషల్ విషెస్..!

సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ హవా

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరో ?

'భవదీయుడు భగత్ సింగ్.. పవన్ రోల్ పై క్లారిటీ..!

పవన్ కళ్యాణ్ రష్యా వెకేషన్ పూర్తి

పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ మహేష్ బాబు ట్వీట్

పవన్ కు కరోనా పాజిటివ్ - కొనసాగుతున్నచికిత్స

మార్షల్ ఆర్ట్స్ కై యువతకు పవన్ కళ్యాణ్ పిలుపు
క్రిష్ 'అంతర్వాహిని' - పవన్ సినిమా టైటిలా..?

#PSPK27 కోసం హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ డైరెక్టర్

'వకీల్ సాబ్' మిగిలిన షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!
సత్య దేవ్ నటనపై పవన్ ప్రశంస
పవన్ -సురేందర్ రెడ్డి మూవీ లాంచ్ డేట్ ఖరారు..!
క్రిష్ సినిమా నుండి పవన్ ప్రీ లుక్ రిలీజ్

పవన్ ఇన్ట్సా పోస్ట్- బాధ్యత పెరిగింది
సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఉంటాయి సినిమా కలెక్షన్స్ కూడా.. ఫ్లాప్ సినిమాకు కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకునే క్రేజ్ ఆయన సొంతం. ఇక సినిమాల్లో ఎలాగైతే తన మార్కును చూపించాడో ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన మార్కును వేసుకోగలిగాడు. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యాడు.

పవన్ కళ్యాణ్‌కు రేణు దేశాయ్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక అంతకుముందు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. కాగా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా ఎక్కువ స్థానాలు (21) గెలుచుకోవడంతోపాటు ఆయన కూడా స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో నెగ్గిన విషయం తెలిసిందే.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠంగా జరిగాయి. అందుకు పదిరెట్లు ఉత్కంఠతతో ఏపీ ఎన్నికల ఫలితాల రిజల్ట్ కోసం అందరూ ఎదురుచూశారు. ఆ రిజల్ట్ జూన్ 4వ తేదీన వచ్చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అంతేకాదు ఈ కూటమి దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవిని అధిరోహించడానికి ఈ కూటమి ఎంతగానో తోడ్పడింది. ఈనేపథ్యంలోనే మోడీ మూడీసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.

మహేష్ కు పవన్ స్పెషల్ విషెస్..!
ఫ్యాన్స్ తన హీరోల కోసం ఎంత కొట్టుకున్నా హీరోలు మాత్రం తాము అంతా ఒకటే అని ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. కానీ మహేష్, పవన్ మాత్రం ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. పవన్ సినిమాలపై మహేష్ బాబు స్పందిస్తాడు.. మహేష్ సినిమాలపై పవన్ స్పందిస్తాడు.. పవన్ నుండి మహేష్ కు అప్పుడప్పుడు స్పెషల్ గిఫ్ట్స్ లాంటివి వెళతాయి. ఇక మరోసారి పవన్ మహేష్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ కు సినీ సెలబ్రిటీల నుండి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్…
ఒక్క భాషలోనే 100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించే హీరోలు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు
పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయిన సినిమాలు 100 కోట్లు కలెక్షన్స్ సాధించడం సాధారణమే. ఒక్క భాషలోనే రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం విశేషం. ఈ సంవత్సరం ప్రాంతీయ భాషాచిత్రాలు గా రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలుగా "సర్కారు వారి పాట", "భీమ్లా నాయక్" మూవీస్ నిలిచాయి. తెలుగు భాషలోనే రిలీజ్ అయిన "సర్కారు వారి పాట"155 కోట్లు , "భీమ్లా నాయక్" 132 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి.

నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలు పలు అవార్డ్స్ గెలుచుకొనడం విశేషం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా "కలర్ ఫొటో", ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ ఎస్ (అల .. వైకుంఠపురములో .. ), ఉత్తమ కొరియోగ్రఫీ , మేకప్ కేటగిరీ లో "నాట్యం" మూవీ అవార్డ్స్ గెలుచుకున్నాయి.

సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ హవా
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు.తాజా అప్ డేట్ ప్రకారం త్వరలోనే షూటింగ్ లో పవన్ పాల్గొంటారని సమాచారం. మొదట “హరిహర వీరమల్లు” చిత్రీకరణ మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారనీ , ఆ తరువాత సముద్రఖని డైరెక్షన్‌లో చేయబోతున్న” వినోధయ సీతమ్”తమిళ మూవీ…

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరో ?
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. థియేటర్స్ లో ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. అంతటి క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” , సముద్ర ఖని…

'భవదీయుడు భగత్ సింగ్.. పవన్ రోల్ పై క్లారిటీ..!
రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆసినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తరువాత సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా భీమ్లానాయక్ తో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని రెండో హిట్ ను కూడా అందుకున్నాడు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది హ్యాట్రిక్ కోసం. ప్రస్తుతం అయితే పవన్ హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. గత కొంతకాలంగా పలు కారణాల వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడగా రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ రష్యా వెకేషన్ పూర్తి
బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్ "మూవీ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన "భీమ్లా నాయక్ "మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "హరి హర వీరమల్లు "మూవీ సెట్స్ పై ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో "భవదీయుడు భగత్ సింగ్ " మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ మహేష్ బాబు ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడడంతో అభిమానులు సంతోషంగా ఉండగా తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు పవన్ క్షేమాన్ని కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

పవన్ కు కరోనా పాజిటివ్ - కొనసాగుతున్నచికిత్స
కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. వకీల్ సాబ్ టీమ్ కు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే హీరోయిన్ నివేదా థామస్ కరోనా బారిన పడింది. ఆ తర్వాత మరికొందరికి సైతం కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న తన స్పీచ్ తో టాప్ వన్ ట్రెండింగ్ లో నిలిచిన బండ్ల గణేష్ రెండోసారి కోరోనా బారిన పడ్డారు. ఈనేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గత కొద్దిరోజులుగా ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం పవన్…

మార్షల్ ఆర్ట్స్ కై యువతకు పవన్ కళ్యాణ్ పిలుపు
కరాటే లో బ్లాక్ బెల్ట్ హోల్డర్, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న పవన్ కళ్యాణ్ తన మూవీస్ లో వాటిని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు , మరొక వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ యువతకు మంచి సందేశం ఇచ్చారు. ఫిట్ నెస్ తో పాటు యుద్ధ క్రీడలు కూడా నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ యువత కు పిలుపునిచ్చారు.
క్రిష్ 'అంతర్వాహిని' - పవన్ సినిమా టైటిలా..?
పవర్ స్టార్ తన 27వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు జరుపుకోగా కరోనా వలన షూట్ కు బ్రేక్ పడింది. త్వరలో మళ్లీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. ఇటీవలే పవన్ బర్త్‌డే సందర్భంగా పవన్ ప్రీ లుక్ విడుదల చేశారు దర్శకుడు క్రిష్. 'వకీల్‌సాబ్' షూటింగ్ పూర్తి కాగానే పవన్, క్రిష్ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవుతుంది.

#PSPK27 కోసం హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన 27వ సినిమా క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా 15రోజుల షూటింగ్ ను కూడా జరుపుకుంది. ఇక రేసెంట్ గానే పవన్ పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ లుక్ ను బట్టి ఇది పీరియాడిక్ డ్రామా అని అర్థమైపోతుంది. బ్రిటిష్ వారితో పోరాడే నాయకుడి పాత్రలో పవన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.
"బొమ్మ బ్లాక్ బస్టర్ " రష్మీ ఫస్ట్ లుక్ రిలీజ్
విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో "సవారి " మూవీ ఫేమ్ నందు , ప్రముఖ యాంకర్, నటి రష్మీ జంటగా "బొమ్మ బ్లాక్ బస్టర్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నందు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమాని పోతురాజు గా , పోతురాజు కు జంటగా వాణి పాత్రలో రష్మీ నటిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పగడాల , బోసు బాబు , ఆనంద్ రెడ్డి , మనోహర్ రెడ్డి నిర్మాతలు.

'వకీల్ సాబ్' మిగిలిన షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక పవన్ ఫ్యాన్స్ ఊహించని విధంగా పవన్ పుట్టిన రోజు నాడు వరుసగా నాలుగు అప్ డేట్స్ ఇచ్చి ఆనందంలో ముంచెత్తారు. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమా మిగిలిన షూట్ ను జరపడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
సత్య దేవ్ నటనపై పవన్ ప్రశంస
చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని తన నటనతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగిన టాలెంటెడ్ నటుడు సత్య దేవ్. సత్వ దేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. మలయాళ చిత్రం 'మహేషింటే ప్రతీకారమ్' చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంది.
పవన్ -సురేందర్ రెడ్డి మూవీ లాంచ్ డేట్ ఖరారు..!
ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఉదయం నుండి అదే హడావుడి నడుస్తుంది. ఇక పవన్ సినిమాల నుండి కూడా బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. నిజానికి మూడు అప్ డేట్స్ మాత్రమే వస్తాయనుకున్నారు కానీ బోనస్ గా నాలుగో అప్ డేట్ కూడా వచ్చింది అదే సురేందర్ రెడ్డితో సినిమా. ఈ సినిమా ను కూడా అధికారికంగా ప్రకటించారు ఈరోజు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు పవన్ కు సన్నిహితుడైన రామ్ తళ్లూరి ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించనున్నట్టు తెలుస్తుంది.
క్రిష్ సినిమా నుండి పవన్ ప్రీ లుక్ రిలీజ్
మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఈరోజు. ఒక అప్ డేట్ తర్వాత మొరొకటి ఇస్తూ ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హడావుడి నడుస్తుంది. ఈ రోజు ఉదయం 9.9 నిమిషాలకు వకీల్ సాబ్ నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ ఆనందంలో ఉండగానే పవన్ 29 సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. పవన్ 29 సినిమా ముందు అనుకున్నట్టే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే తెరకెక్కుతుంది. ఇక ఆ సంతోషంనుండి తేరుకోకముందే క్రిష్ నుండి అప్ డేట్ వచ్చేసింది.