#PSPK27 కోసం హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ డైరెక్టర్

This Prestigious Hollywood VFX Technician To Work For PSPK27

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తన 27వ సినిమా క్రిష్ జాగర్లపూడి ద‌ర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా 15రోజుల షూటింగ్ ను కూడా జరుపుకుంది. ఇక రేసెంట్ గానే పవన్ పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ లుక్ ను బట్టి ఇది పీరియాడిక్ డ్రామా అని అర్థమైపోతుంది. బ్రిటిష్ వారితో పోరాడే నాయకుడి పాత్రలో పవన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా కోసం క్రిష్ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ డైరెక్టర్‌ బెన్‌లాక్‌ ను ఫిక్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ‘పవన్‌ కల్యాణ్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయడమే కాదు… క్రిష్‌, పవన్‌ కల్యాణ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’ అని కూడా తెలిపాడు బెన్ లాక్. మార్చి లో ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడే బెన్ కూడా హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక హాలీవుడ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ దర్శకుడు ఈ సినిమాకు ఎంటర్‌ అవ్వడంతో మూవీపై అంచనాలు కూడా అదే రేంజ్‌లో పెరిగిపోయాయి.

మరి గతంలో గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా అప్పుడే తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్ ను చూపించాడు. సినిమా చూసిన తర్వాత క్రిష్ పై ప్రశంసలు కురిపించారు అందరూ. ఇక ఇప్పుడు ఈ సినిమా కు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుదామని చూస్తున్నాడు క్రిష్. మరి క్రిష్ పనితనం ఏంటో తెలుసుకదా. తక్కువ బడ్జెట్ లోనే మంచి అవుట్ పుట్ ఇవ్వగలడు. కాగా సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏఎం ర‌త్నం నిర్మి‌స్తున్నారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + fifteen =