సత్య దేవ్ నటనపై పవన్ ప్రశంస

Power Star Pawan Kalyan Accolades Satyadev For His Performance In His Latest Movie

చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని తన నటనతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగిన టాలెంటెడ్ నటుడు సత్య దేవ్. సత్వ దేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. మలయాళ చిత్రం ‘మహేషింటే ప్రతీకారమ్‌’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ సినిమాలో నటనకు గాను పవర్ స్టార్ కూడా సత్య దేవ్ ను ప్రశంసించారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. సత్య దేవ్ కూడా ఒకే ఒక పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌గారికి హ్యాపీ బర్త్‌డే. జన్మదినోత్సవ శుభాకాంక్షలు సర్` అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు పవన్ స్పందిస్తూ.. `ధన్యవాదాలు సత్యదేవ్‌గారు. మీ లేటెస్ట్ సినిమా `ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య`లో మీ నటనను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆల్ ది బెస్ట్` అని రిప్లై ఇచ్చారు. ఇక పవన్ నుంచి ఈ ప్రశంస రావడంతో.. `ధన్యవాదాలు సర్. మీ ప్రశంసను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీ పుట్టిన రోజునాడు నాకు బహుమతి అందించినందుకు మరోసారి ధన్యవాదాలు సర్. మీ మెసేజ్‌తో మా టీమ్ మొత్తం చాలా సంతోషంగా ఉంద`ని ట్వీట్ చేశాడు. మరి పవన్ నుండి ఇలాంటి ప్రశంసలు దక్కడం అంటే విశేషమే కదా.

 

కాగా ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో నరేశ్‌, సుహాస్‌, జబర్దస్త్‌ రామ్‌ ప్రసాద్‌, టీఎన్‌ఆర్‌, రవీంద్ర విజయ్‌, రాఘవన్‌ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. జాతీయ అవార్డు గ్రహీత మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన బిజిబల్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − three =