మహేష్ కు పవన్ స్పెషల్ విషెస్..!

Pawan kalyan Special Birthday Wishes to Mahesh Babu,Pawan Kalyan Recollects His Memories With Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan kalyan,Power Star Pawan kalyan,Pawan kalyan latest Updates,Pawan kalyan Movie Updates,Pawan kalyan Wish Mahesh babu on His Birthday,Pawan kalyan Birthday Wish to Mahesh Babu, Mahesh Babu,Super Star Mahesh Babu,Pawan Kalyan Recollects,Pawan Kalyan Recollects His Memories with Super Star Mahesh Babu,Mahesh Babu Birthday,Super Star Mahesh Babu Birthday,Pawan Kalyan Special Birthday Wish to Mahesh Babu,Pawan Kalyan Upcoming Movies, Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Upcoming Movie Hari Hara Veera Mallu Updates

ఫ్యాన్స్ తన హీరోల కోసం ఎంత కొట్టుకున్నా హీరోలు మాత్రం తాము అంతా ఒకటే అని ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. కానీ మహేష్, పవన్ మాత్రం ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. పవన్ సినిమాలపై మహేష్ బాబు స్పందిస్తాడు.. మహేష్ సినిమాలపై పవన్ స్పందిస్తాడు.. పవన్ నుండి మహేష్ కు అప్పుడప్పుడు స్పెషల్ గిఫ్ట్స్ లాంటివి వెళతాయి. ఇక మరోసారి పవన్ మహేష్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ కు సినీ సెలబ్రిటీల నుండి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మహేష్ కు ట్విట్టర్ ద్వారా స్పెషల్ బర్త్ డే విషెస్ అందించారు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

” ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు.

‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిద్దాం. ‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంధాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.” అని పవన్ తెలిపాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 8 =