‘వకీల్ సాబ్’ మిగిలిన షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!

Pawan Kalyan Vakeel Saab Movie Gets Muhurtham Date For Shooting The Remaining Portion Of The Film

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక పవన్ ఫ్యాన్స్ ఊహించని విధంగా పవన్ పుట్టిన రోజు నాడు వరుసగా నాలుగు అప్ డేట్స్ ఇచ్చి ఆనందంలో ముంచెత్తారు. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమా మిగిలిన షూట్ ను జరపడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి జూన్ లోనే షూట్ ను ప్రారంభించాలనుకున్నారు కానీ అప్పుడు కుదర్లేదు.. అయితే అందరూ చిన్నగా షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇక ఈ సినిమా షూట్ ను ప్రారంభించాలని కూడా చూస్తున్నారట. అంతేకాదు ఈ నెల 23నుండి మిగిలిన షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారట. దాదాపు ఇంకా 35 రోజుల షూటింగ్ మిగిలి ఉందట. అందులో 20 రోజులు పవన్ ఒక్కరిపైనే సన్నివేశాలు ఉన్నాయట. మరి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ నెలలో షూటింగ్ మొదలుపెడతారేమో చూద్దాం.

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది.. సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కు రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసే ఛాన్స్ లేదు.. వచ్చే ఏడాదే అవకాశం ఉంది.. చూద్దాం అప్పుడైనా రిలీజ్ అవుతుందో లేదో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =