మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు.తాజా అప్ డేట్ ప్రకారం త్వరలోనే షూటింగ్ లో పవన్ పాల్గొంటారని సమాచారం. మొదట “హరిహర వీరమల్లు” చిత్రీకరణ మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారనీ , ఆ తరువాత సముద్రఖని డైరెక్షన్‌లో చేయబోతున్న” వినోధయ సీతమ్”తమిళ మూవీ తెలుగు రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటారనీ సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమాలలోనైనా , రాజకీయాలలో నైనా పవన్ కళ్యాణ్ పై ఉండే క్రేజ్ విషయం తెలిసిందే. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ప్రొఫైల్ ఫోటో ఛేంజ్ చేశారు. కొత్త ఫోటో లో పవన్ కళ్యాణ్ లుక్ అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం లేటెస్ట్ పవన్ కళ్యాణ్ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: