“బొమ్మ బ్లాక్ బస్టర్ ” రష్మీ ఫస్ట్ లుక్ రిలీజ్

Rashmi First Look Is Out From Bomma Blockbuster Movie.

విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో “సవారి ” మూవీ ఫేమ్ నందు , ప్రముఖ యాంకర్, నటి రష్మీ జంటగా “బొమ్మ బ్లాక్ బస్టర్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నందు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమాని పోతురాజు గా , పోతురాజు కు జంటగా వాణి పాత్రలో రష్మీ నటిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పగడాల , బోసు బాబు , ఆనంద్ రెడ్డి , మనోహర్ రెడ్డి నిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బొమ్మ బ్లాక్ బస్టర్ ” మూవీ మోషన్ పోస్టర్ , నందు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాణి పాత్రలో నటిస్తున్న రష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ యాంకర్ ప్రదీప్ రిలీజ్ చేశారు. కిరీటం ధరించి , ఏడుకొండల నామం తో , మెడలో పూలమాలతో చిరునవ్వులు చిందిస్తున్న రష్మీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ పేరుకు తగ్గట్టుగానే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమనీ , హీరో నందు (పోతురాజు ), హీరోయిన్ రష్మీ “(వాణి ) పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =