టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. థియేటర్స్ లో ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. అంతటి క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” , సముద్ర ఖని దర్శకత్వంలో సూపర్ హిట్ “వినోదయ సితం” తమిళ మూవీ తెలుగు రీమేక్ మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోలు , హీరోయిన్స్ ఉన్నట్టే , హీరో , హీరోయిన్స్ కు కూడా ఫేవరెట్స్ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా ఓ ఫేవరెట్ హీరో ఉన్నారు. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ కు ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి అని అందరూ అనుకుంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫేవరెట్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ అని సమాచారం.అందుకే అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ అటెండ్ అయినట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: