
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2

మన మాతృభూమి గొప్పదనం ఇదే -పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ 'ఫస్ట్ వాల్ పోస్టర్'

#PSPK29 - సురేందర్ రెడ్డితో కన్ఫామ్
రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వేణు శ్రీరామ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో.. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. ఇక పవన్ 29 సినిమాపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొన్ని సార్లు.. డాలీ దర్శకత్వంలో అని కొన్ని సార్లు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కి కూడా బ్రేక్ వేస్తూ ఈ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ పవన్ 29వ సినిమా అప్ డేట్ కూడా ఇచ్చేసారు.
'వకీల్ సాబ్' మోషన్ పోస్టర్ రిలీజ్
మొత్తానికి పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టైం రానే వచ్చేసింది. నిజానికి ఈ బర్త్ డే ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళ నుండి పుట్టినరోజులు జరుగుతున్నా ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చింది లేదు. రెండేళ్ల తర్వాత వస్తున్నా అభిమానులను ఏ మాత్రం నిరాశకు గురిచేయకుండా తను చేస్తున్న మూడు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ తో వచ్చేస్తున్నాడు.
పవన్ ఫ్యాన్స్ బీ రెడీ - బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు అంటే ఆయన అభిమానులకు పండగ రోజు లాంటిదే. సెప్టెంబర్ 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఇక ఆ రోజు రానే వచ్చేస్తుంది. రేపు సెప్టెంబర్ 2.. పవన్ పుట్టిన రోజు. ఇక ఈ ఏడాది ఆయన అభిమానులకు ఇంకా స్పెషల్ ఎందుకంటే.. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన మొహానికి మేకప్ వేసుకోడమే కాదు.. మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది... రెండు సినిమాలు లైన్ లో వున్నాయి. ఇక రేపు పవన్ పుట్టిన రోజు కావడంతో పవన్ అభిమానులకు వరుస అప్ డేట్స్ తో పెద్ద ట్రీట్ ఇవ్వనున్నారు. రేపు మూడు సర్ ప్రైజ్ లు రానున్నాయి.
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ - మైత్రీ నుండి అప్ డేట్
పవన్ పుట్టిన రోజు హడావుడి అప్పుడే మొదలైపోయింది. ఇక అభిమానులు ఆశగా ఎదురు చూసేది పవన్ సినిమా అప్ డేట్స్ కోసం. రీ ఎంట్రీ లో పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు. కానీ కరోనా వల్ల సీన్ మొత్తం రివర్స్ అయింది. పరిస్థితులు మాములుగా ఉండి ఉంటే ఈపాటికి వకీల్ సాబ్ విడుదలైపోయేది. క్రిష్ తో సినిమా సగం షూటింగ్ పూర్తయ్యేది. కానీ ఇంకా వకీల్ సాబ్ సినిమా షూటింగే పూర్తి కాలేదు. ఇంకా కొన్నిరోజుల షూటింగ్ మిగిలివుంది. అది పూర్తయ్యాక క్రిష్ సినిమా. ఇక ఈ సినిమాలతో పాటు హరీష్ శంకర్ తో కూడా పవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మైత్రి మూవీ…
మన మాతృభూమి గొప్పదనం ఇదే -పవన్ కళ్యాణ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు విశేష ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రజలకు సేవ చేయాలనే తలంపు తో సినిమాలకు దూరం అయ్యి పొలిటికల్ పార్టీ "జనసేన " ను స్థాపించారు. సామజిక అంశాల పట్ల పవన్ కళ్యాణ్ బాధ్యతతో వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తూ "వకీల్ సాబ్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పవర్ స్టార్ 'ఫస్ట్ వాల్ పోస్టర్'
సినిమా హిట్ ఫట్ తో సంబంధంలేదు.. ఆయన ఉంటే చాలు కలెక్షన్స్ అలా వచ్చేస్తాయి.. అయనకు ఫ్యాన్స్ కాదు ఉండేది భక్తులు.. టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో పవర్ స్టార్ కు ఉన్న ఇమేజ్, క్రేజ్ వేరు.. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్దమయ్యేవుంటది కదా. ఇంకెవరు.. చిరు తమ్ముడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ తో.. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కోట్లమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకొని పవర్ స్టార్ అయ్యాడు. అతడ్ని కథానాయకుడిగా ఎంత మంది అభిమానిస్తారో, వ్యక్తిగా అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన క్రేజ్…