మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్

pawan kalyan take oath as andhra pradesh minister

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠంగా జరిగాయి. అందుకు పదిరెట్లు ఉత్కంఠతతో ఏపీ ఎన్నికల ఫలితాల రిజల్ట్ కోసం అందరూ ఎదురుచూశారు. ఆ రిజల్ట్ జూన్ 4వ తేదీన వచ్చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అంతేకాదు ఈ కూటమి దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవిని అధిరోహించడానికి ఈ కూటమి ఎంతగానో తోడ్పడింది. ఈనేపథ్యంలోనే మోడీ మూడీసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడ నేడు అంటే జూన్ 12వ తేదీన కేసరపల్లి ఐటీ పార్క్ లో ప్ర‌మాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో మొదటిగా పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సభ హోరెత్తిపోయింది.

విశేషం ఏంటంటే.. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు విచ్చేసారు. ఇంకా సినీ నటుడు పద్మవిభూషణ్ చిరంజీవి, రామ్ చరణ్ ఇంకా మెగా ఫ్యామిలీ మెంబర్స్, తలైవా రజనీకాంత్ సతీమణితో పాటు ఈ కార్యక్రమానికి వచ్చారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈకార్యక్రమానికి విచ్చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.