రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆసినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తరువాత సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా భీమ్లానాయక్ తో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని రెండో హిట్ ను కూడా అందుకున్నాడు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది హ్యాట్రిక్ కోసం. ప్రస్తుతం అయితే పవన్ హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. గత కొంతకాలంగా పలు కారణాల వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడగా రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా వీటితో పాటు భారీ అంచనాలు ఉన్న మరో సినిమా భవదీయుడు భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ రావడంతో ఈసినిమాపై మొదటి నుండి మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టే హరీష్ శంకర్ కూడా సాలిడ్ సినిమాను అందిస్తానని హరీష్ శంకర్ చెబుతున్నాడు. మరోవైపు ఈసినిమాలో పవన్ లెక్చరర్ గా కనిపించనున్నాడని మొదటినుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు హరీష్ శంకర్ రివీల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ ఒక ప్రొఫెసర్ గానే కనిపిస్తారని ఈ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలిపారు. దీనితో ఈ సినిమాలో అయితే పవన్ రోల్ పై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి. చూద్దాం మరి ఈసినిమాలో పవన్ ను ఎలా చూపిస్తాడో..
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను కూడా సెట్స్‌పై కి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: