పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయిన సినిమాలు 100 కోట్లు కలెక్షన్స్ సాధించడం సాధారణమే. ఒక్క భాషలోనే రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం విశేషం. ఈ సంవత్సరం ప్రాంతీయ భాషాచిత్రాలు గా రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలుగా “సర్కారు వారి పాట”, “భీమ్లా నాయక్” మూవీస్ నిలిచాయి. తెలుగు భాషలోనే రిలీజ్ అయిన “సర్కారు వారి పాట”155 కోట్లు ,
“భీమ్లా నాయక్” 132 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అత్యధిక వసూళ్ళు సాధించిన తెలుగు చిత్రాలలో “సర్కారు వారి పాట” మూవీ 8వ ప్లేస్ లో ఉండగా , “భీమ్లా నాయక్” మూవీ 10 వ ప్లేస్ లో నిలిచింది. మిగతా చిత్రాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా అత్యధిక వసూళ్ళు సాధించాయి. ఒక్క భాషలోనే 100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించే హీరోలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “హరి హర వీరమల్లు ” , మహేష్ బాబు “#SSMB 28 ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























