పవన్ కళ్యాణ్‌కు రేణు దేశాయ్ స్పెష‌ల్ విషెస్

Renu Desai Congratulates Pawan kalyan After He Takes Oath as AP Minister

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక అంతకుముందు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. కాగా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా ఎక్కువ స్థానాలు (21) గెలుచుకోవడంతోపాటు ఆయన కూడా స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో నెగ్గిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సహా పలువురు కేంద్ర మంత్రులు, నేతల సమక్షంలో మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్ ఇద్దరు పిల్లలు అకీరానందన్, ఆద్య కూడా పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన వీరు తమ తండ్రి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెగా ఫ్యామిలీ సభ్యులతో కలిసి వీరు ప్రధాన వేదికకు సమీపంలో కూర్చున్నారు.

ఈ క్ర‌మంలో నటి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌కు స్పెష‌ల్ విషెస్ తెలియజేసింది. ఇక రేణు దేశాయ్ పవన్‌ మాజీ సతీమణి కాగా.. అకీరా, ఆద్య వీరి పిల్లలే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేణూ తన బిడ్డలతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్‌ చేసిన ఆమె.. “నా క్యూటీస్ వాళ్ల నాన్న బిగ్గెస్ట్‌ డేకి ఎలా రెడీ అయ్యారో చూడండి. ఏపీ రాష్ట్రానికి, అక్కడి ప్రజలకు మంచి చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్‌కు నేడు అదృష్టం కలిసివచ్చింది. ఆయన లక్ష్యం సాధించిన సందర్భంగా కళ్యాణ్‌ గారికి అభినందనలు” అని పేర్కొంది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.