కరాటే లో బ్లాక్ బెల్ట్ హోల్డర్, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న పవన్ కళ్యాణ్ తన మూవీస్ లో వాటిని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు , మరొక వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ యువతకు మంచి సందేశం ఇచ్చారు. ఫిట్ నెస్ తో పాటు యుద్ధ క్రీడలు కూడా నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ యువత కు పిలుపునిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నెల్లూరు కు చెందిన వింగ్ చున్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ పర్ట్ ప్రభాకర్ రెడ్డి ని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. మన దేశంలో అనేక యుద్ధ కళలు ఉన్నాయనీ , వాటిని యువత నేర్చుకుంటే మనోధైర్యం తో పాటు ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుందనీ చెప్పారు. హీరో పవన్ కళ్యాణ్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “హరిహర వీరమల్లు “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ , మలయాళ భాషలో సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: