ట్యాగ్ · 112 కథనాలు · పేజీ 5
'పవన్' తో 'ప్రభాస్' హీరోయిన్..!

పవన్ కళ్యాణ్ 2కోట్ల విరాళం

క్రిష్ చిత్రంలో పవన్ ద్విపాత్రాభినయం?
క్రిష్ మూవీ లో పవన్ కళ్యాణ్ మేకోవర్

తొందరగానే పని కానిచ్చేసిన 'వకీల్ సాబ్'

2020.. పవన్ డబుల్ ధమాకా?
ఈ నెల 8 నుంచి `పవర్ స్టార్ 27` సెకండ్ షెడ్యూల్
పవన్ సినిమాలో విలన్ గా..?
మరోసారి గాయకుడి అవతారమెత్తుతున్న పవన్?
పవన్-క్రిష్ సినిమా 'విరూపాక్ష'..?

మరోసారి `గబ్బర్ సింగ్` జోడి?

5 ప్రాజెక్ట్స్ తో బిజీగా పవన్..!

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28
పవన్-క్రిష్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్
పవన్ కళ్యాణ్ కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్?
సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందనున్న విషయం తెలిసిందే. "సాహో" మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఎంపిక అయినట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ మాస్ ఎంటర్ టైనర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో `గబ్బర్ సింగ్` (2012) ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్... అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది. కట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ తరువాత ఈ ద్వయం మరోమారు జట్టుకట్టనున్నారు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఈ సంవత్సరం చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
'పవన్' తో 'ప్రభాస్' హీరోయిన్..!
క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇదిలాఉండగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నట్టు పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా జాక్వెలిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమాలో బాలీవుడ్…

కరోనా కోసం ముందుకొచ్చిన టాలీవుడ్ దాతలకు పవన్ కళ్యాణ్ థ్యాంక్స్
టాలీవుడ్ సినీ తారలు 'కరోనా' కట్టడి కోసం విరాళాలు ఇవ్వడానికి ఒకరి తర్వాత ఒకరు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఒకరోజు అటు ఇటుగా అందరూ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి తమ వంతు సాయం అందించారు. ఇంకా విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరాళాలు ఇచ్చి ప్రజలకు అండగా నిలిచినందుకు... పేరు పేరునా హీరోలకు కృతజ్ఞతలు తెలిపాడు.

పవన్ కళ్యాణ్ 2కోట్ల విరాళం
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా జన జీవనం అస్తవ్యస్తమయింది. ప్రపంచ దేశాలలోనే కాకుండా ఇండియా లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ప్రధాని మోదీ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించడం తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కరోనా వైరస్ నియంత్రణ కై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అద్భుత చర్యలు తీసుకుంటున్నాయి.

క్రిష్ చిత్రంలో పవన్ ద్విపాత్రాభినయం?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియాడిక్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఎం.ఎం. కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... మొఘలాయిల కాలం నాటి వాతావరణంతో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట. అందులో ఒకటి రాబిన్ హుడ్ తరహా పాత్ర కాగా.. మరొకటి మాత్రం చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుందట. త్వరలోనే పవన్ డ్యూయెల్ రోల్ పై క్లారిటీ వస్తుంది.
'వకీల్ సాబ్' లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన లావణ్య త్రిపాఠి..!
హిందీలో అమితాబ్ ప్రధాన పాత్రలో తాప్సి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా పింక్. స్త్రీ స్వేచ్చ, హక్కులపై న్యాయ వ్యవస్థపై ముగ్గురు యువతులు ఎలా పోరాటం చేశారు..వారికి అమితాబ్ ఎలా సాయం అన్నది ఈ సినిమా కథాంశం. ఇక హిందీలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. తమిళ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే తమిళ్ లో కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారనుకోండి. తెలుగులో కూడా ఎదో మెసేజ్ ఇచ్చాం అన్నట్టుగా కాకుండా కమర్షియల్ అంశాలు జోడించనున్నారు. అయితే ఒరిజినల్ కథ ఫ్లేవర్ పోకుండా.. మరి ఎక్కువ హీరోయిజం చూపించకుండా... తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కథలో భాగంగానే హీరోని చూపించాలని ప్లాన్ చేస్తున్నారు.
క్రిష్ మూవీ లో పవన్ కళ్యాణ్ మేకోవర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "వకీల్ సాబ్" మూవీ రూపొందుతుంది. ఈ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. "వకీల్ సాబ్" మూవీ తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందే ఒక పీరియాడిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చారిత్రాత్మక మూవీ "గౌతమి పుత్ర శాతకర్ణి " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

తొందరగానే పని కానిచ్చేసిన 'వకీల్ సాబ్'
పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ట్విట్టర్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్త్రీ గొప్పతనాన్ని చాటేలా ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా అనే పాటను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు టీజర్ ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు…
పవన్ కళ్యాణ్... 1998 నాటి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?
వేసవికి విడుదల కాబోతున్న `వకీల్ సాబ్`తో రీ-ఎంట్రీ బాట పట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఇదే ఏడాది మరో సినిమాతో పలకరించబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సదరు పిరియాడిక్ ఫిల్మ్ దీపావళి కానుకగా సందడి చేయనుందని సమాచారం. సో... 2020లో పవన్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడన్నమాట.

2020.. పవన్ డబుల్ ధమాకా?
`అజ్ఞాతవాసి` అనంతరం స్వల్ప విరామం తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ మూడు చిత్రాలకు కమిట్ అయ్యారు. వాటిలో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. పవన్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా రాబోతున్న `వకీల్ సాబ్` వేసవి కానుకగా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న పిరియాడిక్ ఫిల్మ్ కూడా ఇదే ఏడాదిలో తెరపైకి రాబోతుందని సమాచారం.
ఈ నెల 8 నుంచి `పవర్ స్టార్ 27` సెకండ్ షెడ్యూల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ పిరియాడిక్ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కి జోడీగా జాక్వలైన్ ఫెర్నాండెజ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. స్వరవాణి కీరవాణి బాణీలు సమకూర్చుతున్నాడు.
పవన్ సినిమాలో విలన్ గా..?
క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడే స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో నటించే నటీమణుల విషయంలో కూడా రోజుకో పేరు తెరపైకి వస్తుంది. పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ పేరు కూడా వినిపిస్తుంది.
మరోసారి గాయకుడి అవతారమెత్తుతున్న పవన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి నటుడు మాత్రమే కాదు మంచి గాయకుడు కూడా. `తమ్ముడు` చిత్రం కోసం `తాటి చెట్టు`, `ఏం పిల్ల` వంటి బిట్ సాంగ్స్ పాడి తనలోని గాయకుడ్ని పరిచయం చేసిన పవన్.. ఆపై `బై బయ్యే బంగారు రవణమ్మ` (ఖుషి), రావోయి మా ఇంటికి, నువ్వు సారా తాగుట (జానీ), కిళ్ళీ కిళ్ళీ (గుడుంబా శంకర్), పాపారాయుడు (పంజా), కాటమరాయుడా (అత్తారింటికి దారేది), కొడకా కోటేశ్వరరావా (అజ్ఞాతవాసి).. ఇలా మొత్తంగా తొమ్మిది సార్లు గొంతు సవరించుకుని అలరించాడు.

మళ్ళీ పోలీస్ స్టోరీతోనే.. పవన్, హరీష్ చిత్రం?
బ్లాక్ బస్టర్ మూవీ `గబ్బర్ సింగ్`(2012) తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
పవన్-క్రిష్ సినిమా 'విరూపాక్ష'..?
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి మే 15 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరోసారి `గబ్బర్ సింగ్` జోడి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. `గబ్బర్ సింగ్` (2012)లో తొలిసారి జోడీకట్టిన పవన్, శ్రుతి... ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ తరువాత ఈ ఇద్దరు `కాటమ రాయుడు` (2017) కోసం జట్టుకట్టారు. కాగా, స్వల్ప విరామం అనంతరం ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రానుందట.

5 ప్రాజెక్ట్స్ తో బిజీగా పవన్..!
ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో కొట్టే డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? చేయడా? అంటూ మాట్లాడుకోవడంలోనే రెండేళ్లు గడిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ కి క్లారిటీ ఇచ్చి సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఒక సినిమా మాత్రమే చేసే అవకాశం ఉందని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన ఒక్కసారిగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి షాకిచ్చాడు. మరి పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే ఫ్యాన్స్ కు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీ ఎంట్రీ అందులో…

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ మూవీ "గబ్బర్ సింగ్" 2012 వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "గబ్బర్ సింగ్" మూవీ లో తన పెర్ఫార్మెన్స్ కు పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. దాదాపు 8సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28 మూవీ రూపొందనుంది.
పవన్-క్రిష్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. పవన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.