మ‌రోసారి గాయ‌కుడి అవ‌తార‌మెత్తుతున్న ప‌వ‌న్?

Pawan Kalyan Once Again Turns Singer For His Movie

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంచి న‌టుడు మాత్ర‌మే కాదు మంచి గాయ‌కుడు కూడా. `త‌మ్ముడు` చిత్రం కోసం `తాటి చెట్టు`, `ఏం పిల్ల‌` వంటి బిట్ సాంగ్స్ పాడి త‌న‌లోని గాయ‌కుడ్ని ప‌రిచ‌యం చేసిన ప‌వ‌న్.. ఆపై `బై బ‌య్యే బంగారు ర‌వ‌ణ‌మ్మ‌` (ఖుషి), రావోయి మా ఇంటికి, నువ్వు సారా తాగుట (జానీ), కిళ్ళీ కిళ్ళీ (గుడుంబా శంక‌ర్), పాపారాయుడు (పంజా), కాట‌మ‌రాయుడా (అత్తారింటికి దారేది), కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా (అజ్ఞాత‌వాసి).. ఇలా మొత్తంగా తొమ్మిది సార్లు గొంతు స‌వ‌రించుకుని అల‌రించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

క‌ట్ చేస్తే.. స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌రోమారు ప‌వ‌న్ సింగ‌ర్ అవ‌తార‌మెత్త‌నున్నాడ‌ని స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ ఓ పిరియాడిక‌ల్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర‌వాణి బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప‌వ‌న్ ఓ పాట పాడ‌నున్నాడ‌ని వినికిడి. మ‌రి.. ప‌వ‌న్ ప‌దో పాట ఏ స్థాయిలో రంజింప‌జేస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం 2021 ఆరంభంలో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − nine =