పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ట్విట్టర్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్త్రీ గొప్పతనాన్ని చాటేలా ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా అనే పాటను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు టీజర్ ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగిసినట్టే తెలుస్తుంది. పవన్ ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ తప్పా చిత్రీకరణ ముగిసినట్టేనట. ఆ ఎపిసోడ్ కూడా తొందర్లోనే షూట్ చేయనున్నారట. మొత్తానికి చాలా తొందరగానే సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.




ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. మే 15న వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























