ట్యాగ్ · 112 కథనాలు · పేజీ 6

పవన్ డబుల్ ధమాకా..!
పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే?

రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్?
'పింక్' రీమేక్ షూటింగ్ డేట్ కుదిరిందా..?

ఒకే ఫ్రేమ్ లో పవన్-త్రివిక్రమ్ మ్యాటరేంటబ్బా..!
కాస్ట్యూమ్స్ డ్రామాలో పవన్ కళ్యాణ్?

'పింక్' తర్వాత 'పవన్' ముల్టీస్టారర్..?
పవన్ ఓటమిపై పరుచూరి పలుకులు..!

నిర్మాతగా పవన్ చెర్రీతో మూవీ..!

మేనల్లుడికి తన సినిమాను ఆఫర్ చేసిన పవన్!
పవన్ కళ్యాణ్ తో పాన్ - ఇండియా ప్రాజెక్ట్?
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్-ఇండియా ప్రాజెక్టుల హవా సాగుతోంది. దక్షిణాది సినిమాలే కాదు ఉత్తరాది చిత్రాలు కూడా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ అవుతూ... పాన్-ఇండియా స్టేటస్ తో సందడి చేస్తున్నాయి. `బాహుబలి` సిరీస్ తో ఈ తరహా చిత్రాలకు ఊపు రాగా... తెలుగునాట `సాహో`, `సైరా` వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలు కూడా అదే బాట పట్టాయి.

పవన్ డబుల్ ధమాకా..!
తాము అభిమానించే హీరో ఇంక సినిమా చేయడని ఎక్కడో కాస్త నిరాశలో ఉన్న అభిమానులకు పవన్ డబుల్ ధమాకా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే పింక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి పింక్ రీమేక్ మొదలైపోయింది. నిన్నటి నుండి పింక్ రీమేక్ చిత్ర షూటింగ్ ను స్టార్ట్ చేశారు. అంతేకాదు ఈ షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నాడు. షూటింగ్ సెట్స్ లోని పవన్ ఫోటోకూడా ఒకటి లీక్ అయింది. ఆ ఫోటో చూస్తుంటే.. పింక్ చిత్రం కోసం తన లుక్ పెద్దగా మార్చినట్టు కనిపించట్లేదు పవన్. ఇకపోతే ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే?
హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`... తమిళంలో `నేర్ కొండ పార్ వై` పేరుతో రీమేక్ అయి అక్కడా బ్లాక్ బస్టర్ బాట పట్టింది. అంతేకాదు.. ఇప్పుడా ఎమోషనల్ కోర్ట్ డ్రామా తెలుగులోనూ రీమేక్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెరకెక్కనున్న ఈ రీమేక్ కి `లాయర్ సాబ్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. `పింక్` రీమేక్ ని తన పునరాగమనానికి వేదికగా చేసుకున్న పవన్.. ఆపై టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నాటి కాలంలో సాగే ఈ పిరియాడికల్ ఫిల్మ్ లో పవన్.. రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమిస్తారని తెలిసింది. అంటే.. అవినీతిపరులైన పెద్దల సొమ్మును కొట్టి పేదలకు సాయం చేసే దొంగగా పవర్ స్టార్ కనిపిస్తాడన్నమాట.
'పింక్' రీమేక్ షూటింగ్ డేట్ కుదిరిందా..?
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సంగతి కూడా విదితమే. మరి ఇప్పటికీ కన్ఫ్యూజన్ వున్న ఈ సినిమా ప్రారంభంపై ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. తాజా సమాచారం మేరకు ఈ నెల 20 నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. పవన్ కూడా త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననున్నారట. ఒకపక్క రాజకీయాల్లో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ ఈ సినిమా కోసం కొద్దిరోజులు మాత్రమే కేటాయించడంతో దర్శక నిర్మాతలు కూడా అందుకు…

ఒకే ఫ్రేమ్ లో పవన్-త్రివిక్రమ్ మ్యాటరేంటబ్బా..!
రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ పై గతకొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దిల్‌రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కూడా టాక్స్ వినిపించాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు 'పింక్' రీమేక్ అని ఎప్పుడైతే వార్త బయటకి వచ్చిందో అప్పటినుండి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తూనే వుంది.
కాస్ట్యూమ్స్ డ్రామాలో పవన్ కళ్యాణ్?
`అజ్ఞాతవాసి` అనంతరం రాజకీయాలపై దృష్టి పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... స్వల్ప విరామం తరువాత మళ్ళీ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత `పింక్` రీమేక్ లో నటించనున్న పవన్... అనంతరం ఓ కాస్ట్యూమ్స్ డ్రామాలో నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

'పింక్' తర్వాత 'పవన్' ముల్టీస్టారర్..?
అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను తమిళంలో 'నెర్కొండ పార్వాయి' అనే టైటిల్‌తో.. అజిత్ ప్రధాన పాత్రలో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. ఇప్పుడు తెలుగులోను పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ…
పవన్ ఓటమిపై పరుచూరి పలుకులు..!
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత, పపర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు నియోజక వర్గాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఓటిమి మాత్రం ఏ ఒక్కరూ ఊహించనిదే. అందరూ రెండు నియోజక వర్గాల్లో ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారనే అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఓటమిపాలయ్యారు. అయితే ఇప్పుడు ఈ విషయం పై స్పందించిన పరుచూరి గోపాలకృష్ణ రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

నిర్మాతగా పవన్ చెర్రీతో మూవీ..!
త్రివిక్రమ్ డైరెక్షన్ .. పవన్ కళ్యాణ్ నిర్మాత.. రామ్ చరణ్ హీరో.. ఆహా ఈ కాంబినేష్ ఊహించుకోవడానికి ఎంత బావుంది. అలాంటిది ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడాకి చాలా బావుంది కదా. అలాంటి వార్తే ఇప్పుడు టాలీవుడ్ వేదికగా చక్కర్లు కొడుతుంది.

'ఖుషి - జల్సా'లను త్యజించి మట్టి చిప్పలో జొన్నకూడు తింటున్న “తమ్ముడు”
“ఏదీ తనంత తానై నీ దరికి రాదు.. సాధించి శోధించాలి.. అదియే ధీర గుణం" అన్న శ్రీశ్రీ పాటలోని కార్యసాధనా స్ఫూర్తి మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ లో నిండుగా కనిపిస్తుంది. ప్రజా బాహుళ్యంలో తనకు ఉన్న ఇమేజ్, గ్లామర్ లే తనను, తన జనసేన అభ్యర్థులను గెలిపిస్తాయి అనే ధీమాతో ఇంటి పట్టున కూర్చుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలక్షేపం చేయటం లేదు ఈ జనసేన అధిపతి.

మేనల్లుడికి తన సినిమాను ఆఫర్ చేసిన పవన్!
సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయాల్లో మమేకమైపోయారు. ఒక రకంగా ఇది అభిమానులను బాధించే విషయమే అయినా.. తమ అభిమాన హీరో రాజకీయాల్లో కూడా తన సత్తా చూపించాలని... అక్కడ కూడా తన ముద్ర వేయాలని కోరుకుంటున్నారు. మళ్లీ పవన్ సినిమాల్లోకి వస్తాడా? రాడో కూడా తెలియదు. కానీ పవన్ ఏ మాత్రం కాస్త ఇంట్రెస్ట్ చూపించినా... ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే...