మ‌రోసారి `గ‌బ్బ‌ర్ సింగ్` జోడి?

Gabbar Singh Hit Combination Repeats Again,Harish Shankar, Shruti Hassan,Latest Telugu Movies News, Pawan Kalyan, Pawan Kalyan Latest Movie Details, Pawan Kalyan latest News, Pawan Kalyan New Movie News, Pawan Kalyan Upcoming Film Updates, PSPK28, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో శ్రుతి హాస‌న్ ఒక‌రు. `గ‌బ్బ‌ర్ సింగ్` (2012)లో తొలిసారి జోడీక‌ట్టిన ప‌వ‌న్, శ్రుతి… ఆ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రు `కాట‌మ రాయుడు` (2017) కోసం జ‌ట్టుక‌ట్టారు. కాగా, స్వ‌ల్ప విరామం అనంత‌రం ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ కాంబినేష‌న్ లో సినిమా రానుంద‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్, `గ‌బ్బ‌ర్ సింగ్` ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోనే శ్రుతి నాయిక‌గా న‌టించ‌నుందని స‌మాచారం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డికానున్నాయి. కాగా, శ్రుతి ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.