క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడే స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో నటించే నటీమణుల విషయంలో కూడా రోజుకో పేరు తెరపైకి వస్తుంది. పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ పేరు కూడా వినిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా అర్జున్ రాంపాల్ ను తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ పాత్రకు తాను అయితే కరెక్ట్ గా ఉంటుందని క్రిష్ తనను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.




మరోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మే15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: