2020.. ప‌వ‌న్ డ‌బుల్ ధ‌మాకా?

Power Star Pawan Kalyan Is Back With A Bang

`అజ్ఞాత‌వాసి` అనంతరం స్వ‌ల్ప విరామం తీసుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ మూడు చిత్రాల‌కు క‌మిట్ అయ్యారు. వాటిలో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ప‌వ‌న్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా రాబోతున్న `వ‌కీల్ సాబ్` వేస‌వి కానుక‌గా మే 15న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఇక క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టిస్తున్న పిరియాడిక్ ఫిల్మ్ కూడా ఇదే ఏడాదిలో తెర‌పైకి రాబోతుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు.. ఆగ‌స్టు నాటికి చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకోనున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని వినికిడి. అదే గ‌నుక నిజ‌మైతే.. 2020లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ‌బుల్ ధ‌మాకా ఇస్తున్న‌ట్లే. మ‌రి.. రాబోయే చిత్రాల‌తో ప‌వ‌న్ ఎలాంటి సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.