5 ప్రాజెక్ట్స్ తో బిజీగా పవన్..!

Pawan Kalyan Busy With Crazy Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Pawan Kalyan,Pawan Kalyan News,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie Updates,Pawan Kalyan Next Project News,Pawan Kalyan Upcoming Film Updates,Pawan Kalyan Latest Movie Details,Pawan Kalyan New Movie Updates

ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో కొట్టే డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? చేయడా? అంటూ మాట్లాడుకోవడంలోనే రెండేళ్లు గడిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ కి క్లారిటీ ఇచ్చి సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఒక సినిమా మాత్రమే చేసే అవకాశం ఉందని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన ఒక్కసారిగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి షాకిచ్చాడు. మరి పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే ఫ్యాన్స్ కు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీ ఎంట్రీ అందులో ఒకటి కాదు ఏకంగా మూడు సినిమాలు అంటే వారి ఆనందం ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘పింక్’ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలోని ఒక భారీ బడ్జెట్ సినిమాను చేయడానికి కూడా ఆయన అంగీకరించాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ షూటింగ్ జరుపుకుంటుంది. రిలీజ్ డేట్ కూడా అప్పుడే ప్రకటించారు. మే 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. క్రిష్ తో చేస్తున్న సినిమా మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మ‌రోవైపు హరీశ్ శంకర్ వినిపించిన ఒక కథకి కూడా ఆయన పచ్చ జెండా ఊపాడు.ఈ సినిమాను కూడా పవన్ తొందరగానే కంప్లీట్ చేయనున్నాడు.

[custom_ad]

ఇక వీటితో పాటు పవన్ మరో రెండు సినిమాలను కూడా లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే అవి హీరోగా కాదులెండి. నిర్మాతగా రెండు సినిమాలను తీయడానికి ప్లాన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను పవన్ తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై.. అలాగే మరో హీరోతో మరో సినిమా నిర్మించాలని చూస్తున్నాడట. సరైన కథ దొరికితే వచ్చే ఏడాది ఈ రెండు ప్రాజెక్ట్స్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడట.

మరి ఏదిఏమైనా మా హీరో ఒక్క సినిమా చేస్తే చాలు మళ్ళీ అని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పవన్. చూద్దాం మరి ఈ ఐదు సినిమాలతో ఆగుతాడో.. మరికొన్ని సినిమాలను పనిలో పనిగా లైన్ లో పెడతాడో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =