
ట్యాగ్ · 131 కథనాలు · పేజీ 6


'పెద్దన్న' టీజర్ రిలీజ్

'అన్నాత్తే' టీజర్ రిలీజ్

'అన్నాత్తే' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ రిలీజ్

అక్టోబర్ లో గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'

అట్లీ-షారుఖ్ సినిమాలో రానా..!

ఫైనల్లీ షారుఖ్-అట్లీ సినిమా షురూ

ఫైనల్లీ ఎంగేజ్ మెంట్ కన్ఫామ్ చేసిన 'నయన్'

'షారుఖ్' కోసం స్పెషల్ టీజర్..!

వారితో నటించడం సరదాగా ఉంటుంది - సమంత

లేడీ సూపర్ స్టార్ తో కన్నడ సూపర్ స్టార్

స్ట్రిక్ట్ రూల్స్ తో రజినీ 'అన్నాత్తే' షూట్

అన్నాత్తే షూటింగ్ కు లేడీ సూపర్ స్టార్

సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?

వాళ్లిద్దరితో నటించడం చాలా హ్యాపీ
"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్నాత్తే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమేషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను చూస్తుంటే రజినీ అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నట్టు తెలుస్తుంది. యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్ స్టైల్, డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచేసింది.

'పెద్దన్న' టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా అన్నాత్తే. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తెలుగులో ఈసినిమాను పెద్దన్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి తాజాగా తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు…

రజనీకాంత్ "పెద్దన్న "మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తలైవా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “అన్నాత్తే ” తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ "పెద్దన్న"మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్ , మీనా, ఖుష్బూ సుందర్ కీలకపాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

'అన్నాత్తే' టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అన్ని అడ్డంకులను దాటుకొని ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

'అన్నాత్తే' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సినీ పరిశ్రమలో కరోనా వల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూశాం. ఒకప్పుడు ఉన్న సందడి ఈ రెండేళ్లలో చాలా మిస్సయ్యారు. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త బావుండటంతో కాస్త సందడి మొదలైంది. సినిమా రిలీజ్ లు అలాగే ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఇక ఈ దసరాకు కూడా పండుగ సందర్బంగా కొత్త సినిమాల సందడి కనిపిస్తోంది. వేడుకలతో... ప్రచార కార్యక్రమాలతో ఇప్పటికే సినీ పండగ షురూ అయిపోయింది. ఇక అది ఇంకాస్త రెట్టింపు చేస్తూ అన్నాత్తే రెడీ అయిపోయింది.

'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ లో మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో గోపీచంద్ ఇటీవలే సిటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సీటీమార్ సినిమాతో మంచి విజయం దక్కించుకున్నాడు. సీటీమార్ సక్సెస్ సాధించడంతో ఇక ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ ". ఇప్పటికే రెండు మూడుసార్లు ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 8న విడుదల కానుండటంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్…

అక్టోబర్ లో గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'
యాక్షన్ హీరో గోపీచంద్ ఎంతో కాలం నుండి మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే చాలా కాలం తరువాత సీటీమార్ తో మంచి విజయం దక్కించుకున్నాడు. ఇక ఇదే జోష్ తో ఎన్నో యేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆరడుగుల బుల్లెట్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ ". ఇప్పటికే రెండు మూడుసార్లు ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. ముందు జూన్ అనుకున్నారు.. ఆ తరువాత ఆగష్ట్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ అదీ కుదరలేదు. ఇక ఫైనల్ గా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ రిలీజ్ అంటూ ఒక పోస్టర్…

'అన్నాత్తే' నుండి సాలిడ్ అప్ డేట్.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అన్నాత్తే”. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో రెండు రోజుల నుండి వినాయక చవితి పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా ఫస్ట్ లుక్ ని ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తుండగా.. మోషన్ పోస్టర్ ను సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈసినిమాను…

అట్లీ-షారుఖ్ సినిమాలో రానా..!
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమాను కూడా ప్రారంభించారు కూడా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో టాలెంటెడ్ నటుడు రానా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక కీలక పాత్ర కోసం రానాను ఎంపిక చేశారట మేకర్స్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. కాగా ఈసిమాలో హీరోయిన్స్ గా నయనతార, ప్రియమణి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను షారుఖ్ తన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై స్వయంగా…

ఫైనల్లీ షారుఖ్-అట్లీ సినిమా షురూ
ఒకప్పుడు బాలీవుడ్ బాద్ షా లాగ బాలీవుడ్ ను ఏలిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు కాస్త వెనుకబడ్డాడు. వరుస ఫ్లాపులు రావడంతో ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి సౌత్ డైరెక్టర్ ను నమ్ముకున్నాడు. అట్లీ ర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుందనే టాక్ గత రెండేళ్ల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేశారు మేకర్స్. ఫైనల్లీ ఎప్పటినుండో అనుకుంటున్న షారుఖ్-అట్లీ ఇన్ని రోజులకు పట్టాలెక్కింది.

ఫైనల్లీ ఎంగేజ్ మెంట్ కన్ఫామ్ చేసిన 'నయన్'
మొత్తానికి ఇన్ని రోజులకు స్టార్ హీరోయిన్ కమ్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. నయన తార, విఘ్నేష్ శివన్ ల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే కదా. బహిరంగంగా ఎప్పుడూ స్టేట్ మెంట్స్ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో ఇద్దరూ షేర్ చేసే ఫొటోలు.. పోస్ట్ లను బట్టి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ఈమధ్య పెళ్లిపై కూడా పలు వార్తలు వచ్చాయి. కొంతమంది పెళ్లి అయిపోయిందంటే మరికొంతమంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కథనాలు రాసేశారు. ఇక ఫైనల్ గా ఇన్ని రోజులకు నయన తార ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

'షారుఖ్' కోసం స్పెషల్ టీజర్..!
తమిళ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో అట్లీ కూడా ఒకడు. 'రాజా రాణి' లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీతో మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు తమిళ్ డైరెక్టర్ అట్లీ. ముఖ్యంగా దళపతి విజయ్ తో ఏకంగా తేరీ, మెర్సల్, బిగిల్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఇక విజయ్ తో వరుసగా హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అట్లీ అరంగేట్రం చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇంతవరకూ ఈసినిమా మాత్రం సెట్స్ పైకి…

వారితో నటించడం సరదాగా ఉంటుంది - సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ ద్వారా సమంత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అడుగుపెట్టారు. ఆవెబ్ సిరీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో శకుంతల గా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం.

లేడీ సూపర్ స్టార్ తో కన్నడ సూపర్ స్టార్
తక్కువ సినిమాలు చేసినా కానీ కొంతమంది వాళ్ల ఇంపాక్ట్ మాత్రం చూపిస్తారు. వాళ్లు చేసిన పాత్రలు అంత త్వరగా మరిచిపోలేం. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కూడా తెలుగులో చేసింది చాలా తక్కువ కానీ తన నటన ఇంపాక్ట్ మాత్రం చాలా రోజులు గుర్తుండిపోతుంది. అందుకు ఈగ సినిమాలో సుదీప్ చేసిన నెగెటివ్ రోలే రుజువు. ఆ సినిమాలో పెర్ఫామెన్స్ పరంగా సుదీపే స్టో స్టీలర్. సుదీప్ చేయకుంటే ఈగ సినిమాకు అంత స్థాయి వచ్చేది కాదేమో. మరి ఈ సూపర్ స్టార్ కు మరో సూపర్ స్టార్ అది కూడా లేడీ సూపర్ స్టార్ జోడైతే ఆసినిమా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.

స్ట్రిక్ట్ రూల్స్ తో రజినీ 'అన్నాత్తే' షూట్
మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే'. 'అన్నయ్య'గా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఉన్నప్పటికీ అన్నాత్తే చిత్ర బృందం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మరీ చిత్రీకరణ జరుపుతున్నారు.

అన్నాత్తే షూటింగ్ కు లేడీ సూపర్ స్టార్
కరోనా సెకండ్ వేవ్ తో మళ్లీ సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడుతుంది. ఈనేపథ్యంలో అన్నాత్తే సినిమాకు కూడా బ్రేక్ పడిందన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించడంతో షూటింగ్ కు బ్రేక్ పడిందన్నారు. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని.. అవి ఒట్టి పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. తమ సినిమాను అనుకున్నట్లే దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఆవార్తలను నిజం చేస్తూ ఈసినిమాలో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ కూడా హైద్రబాద్ లో వాలిపోయింది. నేడు అన్నాత్తే…

సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె అజయ్ కుమార్ దర్శకత్వంలో మాధవి ప్రధాన పాత్రలో రూపొందిన "మాతృదేవోభవ"మూవీ 1991 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుని కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ బెస్ట్ మూవీ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. కీరవాణి స్వరకల్పనలో వేటూరి రచన , కీరవాణి గానం చేసిన "రాలిపోయే పువ్వా " సాంగ్ విశేష ప్రేక్షకాదరణ పొందింది . బెస్ట్ లిరిసిస్ట్ గా వేటూరి నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

వాళ్లిద్దరితో నటించడం చాలా హ్యాపీ
వివాహం తర్వాత కూడా సమంత సినిమాలు, వెబ్ సిరీస్, షోలు, మరోపక్క బిజినెస్ అంటూ బిజీ బిజీ గా తన కెరీర్‌ను కొనసాగిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత ఒక హీరోయిన్ ఇంత బిజీ గా ఉందంటే ఆ క్రెడిట్ సమంతకు ఇవ్వొచ్చు. ప్రస్తుతం గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?
సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధానపాత్రలలో, పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో మంజు వారియర్ ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తె గా , బాధ్యత గల మహిళగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.ఆమె కు సపోర్ట్ గా నిలిచిన మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. మలయాళ మూవీ లో నటించిన మంజు వారియర్ పాత్రకు నయనతార ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.
రూమర్స్ కు నయన్ బ్రేక్ - ఆ బయోపిక్ లో నటించట్లేదు
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ..వరుస హిట్లతో.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది లేడి సూపర్ స్టార్ నయనతార. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది నయనతార. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో నెట్రికన్, ముక్తి అమ్మాన్, అన్నాత్తే, కథువాకుల రెండు కాదల్ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.