తక్కువ సినిమాలు చేసినా కానీ కొంతమంది వాళ్ల ఇంపాక్ట్ మాత్రం చూపిస్తారు. వాళ్లు చేసిన పాత్రలు అంత త్వరగా మరిచిపోలేం. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కూడా తెలుగులో చేసింది చాలా తక్కువ కానీ తన నటన ఇంపాక్ట్ మాత్రం చాలా రోజులు గుర్తుండిపోతుంది. అందుకు ఈగ సినిమాలో సుదీప్ చేసిన నెగెటివ్ రోలే రుజువు. ఆ సినిమాలో పెర్ఫామెన్స్ పరంగా సుదీపే స్టో స్టీలర్. సుదీప్ చేయకుంటే ఈగ సినిమాకు అంత స్థాయి వచ్చేది కాదేమో. మరి ఈ సూపర్ స్టార్ కు మరో సూపర్ స్టార్ అది కూడా లేడీ సూపర్ స్టార్ జోడైతే ఆసినిమా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నయనతార ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలసిందే. నేట్రికన్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న నయన్.. దాంతో పాటు రజినీకాంత్ సినిమా అన్నాత్తే లో, అలాగే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుంది.
కాగా తాజాగా ఆమె డ్రీమ్ వారియర్స్ నిర్మాణంలో ఒక కొత్త దర్శకుడితో ఓ కొత్త చిత్రం అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానేనట. ఇక ఈసినిమాలో సుదీప్ ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నాడట. మరి నయన్-సుదీప్ ఈ ఇద్దరి మధ్య క్లాష్ అంటే సినిమాకు అంతకుమించిన క్రేజ్ మరొకటి ఉండదు. ఓ స్టార్ హీరో సినిమా స్థాయిలో దీనికి హైప్ రావడం ఖాయం. తమిళంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు .త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. మరి చూద్దాం నిజంగా ఈసినిమా కనుక నిజమైతే మంచి క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: