తమిళ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో అట్లీ కూడా ఒకడు. ‘రాజా రాణి’ లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీతో మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు తమిళ్ డైరెక్టర్ అట్లీ. ముఖ్యంగా దళపతి విజయ్ తో ఏకంగా తేరీ, మెర్సల్, బిగిల్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఇక విజయ్ తో వరుసగా హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అట్లీ అరంగేట్రం చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇంతవరకూ ఈసినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాా సమాచారం ప్రకారం ఒక స్పెషల్ డే రోజు ఈసినిమా లాంచ్ కానున్నట్టు తెలుస్తుంది. ఆగష్ట్ 15న ఈసినిమాను ప్రారంభించడమే కాదు షారుఖ్ స్పెషల్ టీజర్ ను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా దర్శకుడు ఒక టీజర్ తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడట. ఇటీవల ముంబైకి వెళ్లిన అట్లీ కుమార్ అక్కడ ఒక స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేయించినట్లు సమాచారం. టీజర్ కోసం షారుక్ ఖాన్ తో కొన్ని స్పెషల్ షార్ట్స్ ను షూట్ చేయనున్నారట. ఆ టీజర్ ను కూాడా ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: