మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. ‘అన్నయ్య’గా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఉన్నప్పటికీ అన్నాత్తే చిత్ర బృందం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మరీ చిత్రీకరణ జరుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ లో రజినీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కేవలం డైరెక్టర్ శివ ఒక్కడే రజినీతో మాట్లాడుతున్నాడట. అది కూడా దూరంగా ఉండే మాట్లాడుతున్నాడట. శివ తరువాత పర్సనల్ అసిస్టెంట్ మాత్రమే వెలుతున్నాడట.. మేకప్ కూడా అతనే చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో అధిక రక్తపోటుకు గురవ్వగా ఇక చిత్రయూనిట్ కూడా రజినీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట.
కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి కూడా విదితమే. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశారు. అది ఎప్పుడో అయిపోయింది. ఇక ఈసారి తమ సినిమాను అనుకున్నట్లే దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేస్తామని అంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: