సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధానపాత్రలలో, పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో మంజు వారియర్ ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తె గా , బాధ్యత గల మహిళగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.ఆమె కు సపోర్ట్ గా నిలిచిన మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. మలయాళ మూవీ లో నటించిన మంజు వారియర్ పాత్రకు నయనతార ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ నయనతార సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయన తార కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్న నయనతార ప్రస్తుతం 3 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ నయనతార “లూసిఫర్ “తెలుగు రీమేక్ మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం. “లూసిఫర్ “తెలుగు రీమేక్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: