మొత్తానికి ఇన్ని రోజులకు స్టార్ హీరోయిన్ కమ్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. నయన తార, విఘ్నేష్ శివన్ ల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే కదా. బహిరంగంగా ఎప్పుడూ స్టేట్ మెంట్స్ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో ఇద్దరూ షేర్ చేసే ఫొటోలు.. పోస్ట్ లను బట్టి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ఈమధ్య పెళ్లిపై కూడా పలు వార్తలు వచ్చాయి. కొంతమంది పెళ్లి అయిపోయిందంటే మరికొంతమంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కథనాలు రాసేశారు. ఇక ఫైనల్ గా ఇన్ని రోజులకు నయన తార ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం నయనతార నేట్రికన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో నయన తార అంధురాలి పాత్రలో కనిపించనుంది. ఈసినిమా సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో డైరెక్టర్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక టీవీ ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార విఘ్నేష్ శివన్ తో పెళ్లి విషయమై ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన చేతికి ఉన్న రింగ్ చూపిస్తూ మాది ఎంగేజ్ మెంట్ పూర్తి అయ్యిందని క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఎంగేజ్ మెంట్ గురించి క్లారిటీ ఇచ్చిన నయన్ పెళ్లి ఎప్పుడన్నది చెబుతుందో లేక అది కూడా చేసుకున్న తరువాత చెబుతుందో చూద్దాం.
ఇక ఈసినిమాతో పాటు నయనతార ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలసిందే. రజినీకాంత్ సినిమా అన్నాత్తే లో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: