వివాహం తర్వాత కూడా సమంత సినిమాలు, వెబ్ సిరీస్, షోలు, మరోపక్క బిజినెస్ అంటూ బిజీ బిజీ గా తన కెరీర్‌ను కొనసాగిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత ఒక హీరోయిన్ ఇంత బిజీ గా ఉందంటే ఆ క్రెడిట్ సమంతకు ఇవ్వొచ్చు. ప్రస్తుతం గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా గురించి తన ఇన్స్టా లో ఒక పోస్ట్ పెట్టింది. నయనతారతోనూ, విజయ్ సేతుపతితోనూ నటించాలనేది నాకు ఎప్పటినుండో ఉండేది.. ఈ సినిమాలో వీరిద్దరితో చేస్తున్నందుకు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను అంటూ ఒక ఫొటో కూడా పోస్ట్ చేసింది. ఆ ఫొటో లో నయనతార, సమంత ఇద్దరూ ఉన్నారు. ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నట్టు విఘ్నేష్ శివన్ తన ఇన్స్టా ఖాతా ద్వారా తెలిపాడు. అంతేకాదు ఫిబ్రవరి 14న ఒక అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు కూడా పోస్ట్ లో తెలిపాడు.
View this post on Instagram
Feb 14th announcement coming your way today🥳🥳 #KaathuVaakulaRenduKaadhal
Second schedule wrapped up neatly by God’s Grace 🥳😇❤️🧿🧿🧿 @VijaySethuOffl #Nayanthara @Samanthaprabhu2 @anirudhofficial @sreekar_prasad @KVijayKartik @Rowdy_Pictures @7screenstudio pic.twitter.com/NioFH5X8VC
— Vignesh Shivan (@VigneshShivN) February 10, 2021
కాగా సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక స్టార్ హీరో విజయ్ సేతుపతి.. సమంత సౌత్‌లో స్టార్ హీరోయిన్. ఇక నయనతార లేడీ సూపర్‌స్టార్ వీరి ముగ్గురితో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మరి చూడాలి..



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: