కరోనా సెకండ్ వేవ్ తో మళ్లీ సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడుతుంది. ఈనేపథ్యంలో అన్నాత్తే సినిమాకు కూడా బ్రేక్ పడిందన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించడంతో షూటింగ్ కు బ్రేక్ పడిందన్నారు. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని.. అవి ఒట్టి పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. తమ సినిమాను అనుకున్నట్లే దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఆవార్తలను నిజం చేస్తూ ఈసినిమాలో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ కూడా హైద్రబాద్ లో వాలిపోయింది. నేడు అన్నాత్తే షూటింగ్ లో పాల్గొనడానికి నయనతార హైద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ కొన్ని రోజులు షూటింగ్ జరుపుకొని తిరిగి చెన్నై వెళ్లనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి కూడా విదితమే. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశారు. అది ఎప్పుడో అయిపోయింది. సినిమా షూటింగే పూర్తి కాలేదు. మరి చూద్దాం అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తారో లేదో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: