అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమాను కూడా ప్రారంభించారు కూడా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో టాలెంటెడ్ నటుడు రానా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక కీలక పాత్ర కోసం రానాను ఎంపిక చేశారట మేకర్స్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. కాగా ఈసిమాలో హీరోయిన్స్ గా నయనతార, ప్రియమణి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను షారుఖ్ తన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై స్వయంగా నిర్మిస్తుండగా.. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే రానా హీరోగా వస్తున్న విరాటపర్వం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల ఆగిపోయింది. మరోవైపు ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకూ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. దీనితోపాటు ప్రస్తుతం రానా సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: