విభిన్నమైన కథలను ఎంచుకుంటూ..వరుస హిట్లతో.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది లేడి సూపర్ స్టార్ నయనతార. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది నయనతార. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో నెట్రికన్, ముక్తి అమ్మాన్, అన్నాత్తే, కథువాకుల రెండు కాదల్ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా నయన తార మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన రాణి ‘వేలు నాచ్చియార్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. శివగంగై సంస్థానాన్ని పాలించారు వేలు నాచ్చియార్. సుశీ గణేశన్ ఈ చిత్రం తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో రాణి పాత్రకు నయనతారను అనుకున్నారని సమాచారం.
అయితే ఈ వార్తలను కొట్టిపడేసారు నయనతార టీమ్. నయన్ అలాంటి ప్రాజెక్టు లో నటించట్లేదని.. కేవలం రూమర్స్ మాత్రమే అని.. ఎలాంటి ప్రకటనలు లేకుండా తప్పుడు వార్తలను నమ్మొద్దని నయన్ టీం క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడైనా ఈ రూమర్స్ కు బ్రేక్ పడుతుందో లేదో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: